మళ్లీ కెమెరా ముందుకు రేణు దేశాయ్‌!

Renu Desai web series : పవన్ కళ్యాణ్ తో విడాకుల తరవాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు నటి రేణు దేశాయ్‌.. అయితే

Krishna
Published on: 20 Sept 2020 4:07 PM IST
మళ్లీ కెమెరా ముందుకు రేణు దేశాయ్‌!
X

Renu Desai

Renu Desai web series : పవన్ కళ్యాణ్ తో విడాకుల తరవాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు నటి రేణు దేశాయ్‌.. అయితే మళ్ళీ కెమరా ముందుకు రాబోతున్నట్టుగా వెల్లడించారు.. ఓ వెబ్ సిరీస్ లో చేసేందుకు రేణు దేశాయ్‌ సిద్దం అయ్యారు.. ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుందట.. దీనికి సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు.

" త్వరలోనే మళ్ళీ కెమరా ముందుకు వస్తున్నాను.. దీనికి మీ ఆశీస్సులు కావాలి.. ఓ అద్భుతమైన వెబ్‌సిరీస్‌కి సంతకం చేశాను. ఇది వచ్చే నెలలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు అవుతుంది. ఇందులో వాస్తవాలు తెలుసుకునే ఓ మహిళ పాత్రలో నేను కనిపిస్తాను.. ఈ వెబ్‌ సిరీస్‌కి ఎమ్‌ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ నిర్మిస్తున్నారు. దాశరధి సివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు" అని రేణు దేశాయ్‌ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఇక పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది రేణు దేశాయ్‌.. ఆ బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. పవన్ తో విడాకుల అనంతరం వన్స్ మోర్ అనే నిర్మాతగా వ్యవహరించింది. ఇష్క్ వాలా లవ్ అనే మరో చిత్రానికి దర్శకత్వం వహించింది.



Krishna

Krishna

Next Story