మెగాస్టార్ తో రెజీనా!

మెగాస్టార్ తో రెజీనా!
x
Chiranjeevi and Regina (file photo)
Highlights

మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా షూటింగ్ కోసం అన్నీ సిద్ధం అయిపోతున్నాయి. సైరా విజయం ఇచ్చిన ఊపుతో తన తరువాతి సినిమాకి మెగాస్టార్ చిరంజీవి వేగంగా...

మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా షూటింగ్ కోసం అన్నీ సిద్ధం అయిపోతున్నాయి. సైరా విజయం ఇచ్చిన ఊపుతో తన తరువాతి సినిమాకి మెగాస్టార్ చిరంజీవి వేగంగా సిద్ధం అయిపోతున్నారు. ఈరోజు నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది.

కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక సైరా సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన చిరంజీవి ఈ సినిమా కోసం మళ్ళీ స్లిమ్ గా తయారయ్యారు. కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాని ఆగస్టు 14 న విడుదల చేయాలని ముందుగానే నిర్ణయించారు. సైరా సినిమాలో చిరంజీవికి తన మార్కు తో ఎటువంటి పాటలూ చేసే అవకాశం దొరకలేదు. అభిమానులకో ఈ విషయంలో కొంత అసంతృప్తి ఉంది. దీనిని అధిగమించేందుద్కు కొరటాల శివ ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేశారట. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నాయకిగా నటించబోతోంది ఇప్పటికే తెలిసింది. ఇక మిగతా తారాగణం విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.

ఇప్పుడు చిరంజీవి తాజా సినిమాలో సరికొత్త లుక్ రివీల్ అయింది. ఈ లుక్ లో చిరంజీవి స్లిమ్ గా అప్పటి గ్యాంగ్ లీడర్ సినిమా సమయంలో ఎలా ఉన్నారో అలా కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై విపరీతమైన హైప్ షూటింగ్ మొదలు కాకుండానే మొదలైపోయింది. మెగా అభిమానులు అయితే చిరంజీవి లుక్ పై పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యకతం చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

ఇదిలా ఉంటె సైరాలో పాటల విషయంలో నిరాశ చెందిన అభిమానులకు కొరటాల శివ నుంచి అద్భుతమైన వార్తా వెలువడింది. సినిమాలో ఓ స్పెషల్ ఐటం సాంగ్ డిజైన్ చేశారట. ఈ పాటను ఇప్పటికే మణిశర్మ సంగీతంలో రికార్డు చేసేసారట. ఆ పాట ఫుల్ మాస్ మసాలాగా తీయడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఈ పాటలో చిరు సరసన నర్తించడానికి రెజీనా సాయి అన్నారని తెలుస్తోంది. ఇప్పటికే చేతిలో సినిమాలు లేని రెజీనా మెగాస్టార్ సరసన ఒక్క పాటలో చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నారట. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా ఒకే చెప్పేశారట. రెజీనా డాన్సుల్లో ఇరగదీస్తారు. ఈ విషయం ఇప్పటికే మెగాహీరో సాయి ధరమ్ తేజ్ తో చేసిన చిరంజీవి పాట గువ్వా..గోరింకా తో నిరూపించింది. ఇప్పుడు ఏకంగా చిరు తో కలిసి చండేసే అవకాశం రెజీనాకు దొరకడంతో ఆ పాట మరింత హైప్ క్రియేట్ చేస్తుందని అభిమానులు సంబరపడిపోతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories