'రెడ్ జోన్' ట్రైలర్ .. కరోనా టైంలో కొత్త ప్రయోగం..

రెడ్ జోన్ ట్రైలర్ .. కరోనా టైంలో కొత్త ప్రయోగం..
x
Highlights

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో భవిష్యత్తు ప్రణాళిక ఎలా అని సినీ పెద్దలు సందిగ్ధంలో ఉన్నారు.

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో భవిష్యత్తు ప్రణాళిక ఎలా అని సినీ పెద్దలు సందిగ్ధంలో ఉన్నారు. తెలంగాణ సర్కార్ తమ వంతు సహకారం అందిస్తామని అభయం ఇచ్చినా మునుపటిలా షూటింగులు జరుగుతాయో లేదో అనేది స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు శేషు కెఏంఆర్ ఓ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఈ సినిమా పేరు 'రెడ్ జోన్' కాస్త డిఫఫెరెంట్ గా పెట్టాడు. ఇక అంతే వెరైటీగా తెరకెక్కించాడు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ లేడు.. దర్శకుడు దర్శకత్వం చెయ్యలేదు, కాస్ట్ అండ్ క్రూ ఒకరితో ఒకరు కలిసి పని చెయ్యలేదు. ప్రతి నటుడు, నటి తమ ఇళ్లలో ఉంటూ తమ మొబైల్ ఫోన్ సహాయంతో సెల్ఫీ మోడ్‌లో డైలాగ్స్ చెప్పి వాటిని సింక్ సౌండ్‌లో రికార్డు చేసి ఏకంగా ఒక కథనే సృష్టించారు. దీనికి పాట ముంబయి, పూణే గౌరవ్ ప్రథం అనే యువకులు సమకూర్చిగా.. అదే విథంగా ఎడిటింగ్, సౌండ్, మిక్సింగ్ మిగతా పనులు చెన్నై, హైదరాబాద్ నగరాలలో జరిగాయి.

లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించకుండా ఇలాంటి కష్ట కాలంలో సినిమా చేయొచ్చని శేషు నిరూపించాడు. ఈ మూవీలో అజిజ్ నాసర్, బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, సూఫీ ఖాన్, ఆర్ కే మామా, శివ మామిడి నటించారు. డిజిటల్లో ప్లాట్ ఫాంలో సినిమా విడుదల కానుంది.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories