Rebel Star Krishnam Raju about Prabhas: ప్రభాస్ తో కలసి అక్కడ భోజనం చేయాలని నా కోరిక..

Rebel Star Krishnam Raju about Prabhas: పాన్ ఇండియా హీరోగా సంచలనం సృష్టిస్తున్న ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ గా మరో గ్రాండ్ సినిమా చేయబోతున్నారు.

K V D Varma
Published on: 20 Aug 2020 9:06 AM IST
Rebel Star Krishnam Raju about Prabhas: ప్రభాస్ తో కలసి అక్కడ భోజనం చేయాలని నా కోరిక..
X
Krishnam Raju (File Photo)

Rebel Star Krishnam Raju about Prabhas: పాన్ ఇండియా హీరోగా సంచలనం సృష్టిస్తున్న ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ గా మరో గ్రాండ్ సినిమా చేయబోతున్నారు. ఈ వార్త తెలిసినప్పటినుంచి ప్రభాస్ అభిమానులే కాదు తెలుగు సినిమా అభిమానులు అందరూ ఆదిపురుష్ సినిమా పై పెద్ద అంచనాలే వేస్తున్నారు. దానికి తగ్గట్టే రోజుకో ప్రత్యేకత ఈ సినిమా గురించి బయటకు వస్తోంది. ఇప్పుడు ప్రభాస్ పెదనాన్న.. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదిపురుష్ పై తన స్పందన వినిపించారు. వినిపించడమే కాదు ప్రభాస్ రేంజ్ ఏమిటో స్పష్టంగా చెప్పారు.

ప్రభాస్ అభిమానులకు ఆదిపురుష్ పెద్ద పండగే అంటున్నారు కృష్ణంరాజు. తనకు ఒక కోరిక ఉందనీ.. అది ప్రభాస్ కు చెప్పాననీ చెప్పారు. ఇప్పుడు ఆ కోరిక ఆదిపురుష్ తో తీర్చేయబోతున్నాడని మురిసిపోతున్నారు కృష్ణంరాజు. ప్రభాస్ తో కలసి 'బ్లవర్లీ హిల్స్‌'లో భోజనం చేయాలనేది కృష్ణంరాజు కోరిక అట. దీని ప్రత్యేకత ఏమిటో కూడా ఆయన చెప్పారు. ''బ్లవర్లీ హిల్స్‌లో భోజనం అంటే.. అక్కడ ఓన్లీ హాలీవుడ్ స్టార్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అందుకే అక్కడ ప్రభాస్‌తో కలిసి భోజనం చేయాలని ఉందనే కోరిక కోరాను. అందులో ప్రభాస్‌కి కూడా ఒక బిల్డింగ్ ఉండాలి.. నేను అక్కడ ప్రభాస్‌తో కలిసి భోజనం చేయాలి. త్వరలోనే ఆ కోరిక తీరబోతోంది. ప్రభాస్‌ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది'' రెబల్ స్టార్ కృష్ణంరాజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సంబరపడిపోతున్నారు.

ఇక ఆదిపురుష్ సినిమాకి సంబంధించి పలు విషయాలు కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ''ఆదిపురుష్ అంటే విష్ణుమూర్తి.. ఆయన అవతారాల్లో ఆది పురుష్ అనేది ఒక అవతారం. సోసియో ఫాంటసీ కథతో పెద్ద ఎత్తున పెద్ద బడ్జెట్‌తో సినిమా తీయాలని సంకల్పించారు. ప్రభాస్ ఈ సబ్జెక్ట్ వినగానే చాలా ఇంప్రెస్ అయ్యాడు.. బాగుంది ఖచ్చితంగా చేద్దాం అన్నాడు. ఈ సినిమా కథ నేను కూడా విన్నాను.. నాకు బాగా నచ్చింది.. ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇది కేవలం నాలుగు లాంగ్వేజ్‌లు మాత్రమే కాదు.. హాలీవుడ్‌కి కూడా తీసుకు వెళ్లే ప్లాన్ చేస్తున్నాం. ఆలిండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తాం.'' అని ఆయన తెలిపారు.

''ఆది విష్ణువుపై ఈ సినిమా ఉండబోతుంది. ఆయితే దశావతారాలు ఉంటాయా? లేక ఆదిపురుష్ అవతారం మాత్రమే ఉంటుందా? అన్నది మేకర్స్ ఫస్ట్ లుక్‌లో క్లారిటీ ఇస్తారు. ఇది ఇతిహాసగాధ అని పోస్టర్‌లోనే ఉంది. పురాణాలకు సంబంధించిన కంటెంట్‌తోనే ఈ సినిమా ఉంటుంది. దాదాపు ఈ సినిమా వెయ్యి కోట్లు బడ్జెట్ ఉండబోతుంది. బాహుబలి సినిమాతో టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి వెళ్లాడు.. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ హీరో అనిపించుకోబోతున్నాడు ప్రభాస్. మన పురాణాలు, ఇతిహాసాల గొప్పతనం 'ఆదిపురుష్' చిత్రంతో ప్రపంచానికి తెలియజెప్పబోతున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా చూసిన తరువాత ప్రభాస్.. ప్యాన్ ఇండియా సినిమాలు చేయాలని అనుకున్నాడు. అయితే బాహుబలి చిత్రంతోనే ఆ మార్క్ ప్రభాస్ దాటేశాడు.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌‌కి వెళ్లాలని అనుకుంటున్నాడు. కచ్చితంగా ఆది పురుష్ హాలీవుడ్ రేంజిలో ఉంటుంది అని కృష్ణంరాజు అన్నారు. ప్రభాస్ అభిమానులూ..ఇక సంబరాలు చేసుకోండి.. ప్రభాస్ హాలీవుడ్ హీరో అయిపోతున్నాడు. మీ కోరికా అదే కదా!

K V D Varma

K V D Varma

Next Story