మల్టీప్లెక్స్​ బిజినెస్​లోకి మాస్​ మహారాజ.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి...

Ravi Teja Multiplex: టాలీవుడ్​లో మోస్ట్​ సక్సెస్​ఫుల్​ నటుల్లో మాస్​ మహారాజ రవితేజ ఒకరు.

Arun Chilukuri
Published on: 16 April 2024 3:27 PM IST
Ravi Teja Venturing into Theatre Business
X

మల్టీప్లెక్స్​ బిజినెస్​లోకి మాస్​ మహారాజ.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి...

Ravi Teja Multiplex: టాలీవుడ్​లో మోస్ట్​ సక్సెస్​ఫుల్​ నటుల్లో మాస్​ మహారాజ రవితేజ ఒకరు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ స్టార్ హీరో తన క్రేజ్​తో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన మల్టీప్లెక్స్ బిజినెస్​లోకి ఎంట్రీ ఇచ్చారు. హైదరబాద్​లో ఆయన పేరిట మల్టీప్లెక్స్​లను ఓపెన్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏషియన్ రవితేజ అనే పేరుతో హైదరబాద్​లోని పలు ప్రాంతాల్లో ఈ థియేటర్ రన్ అవ్వనుంది.

తాజాగా ఆ బిల్డింగ్​ నిర్మాణానికి సంబంధించిన పూజ కార్యక్రమం జరిగింది. అందులో రవితేజ కుమార్తె మోక్షద పాల్గొన్నారు. ART సినిమాస్‌ పూజా కార్యక్రమంలో మోక్షద ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ అభిమాన హీరో కుమార్తెను చూసిన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏషియన్‌ అధినేత సునీల్ నారంగ్ కూడా పాల్గొనడం విశేషం. మొత్తం ఆరు స్క్రీన్స్‌తో ఈ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ త్వరలో గ్రాండ్‌గా ఓపెన్‌ కాబోతుంది. ఇప్పటికే మ‌హేష్‌ బాబు (AMB), అల్లు అర్జున్‌ (AAA), విజ‌య్ దేవ‌ర‌కొండ (AVD) వంటి స్టార్స్‌తో సంయుక్తంగా ఏషియన్‌ గ్రూప్స్‌ భారీ మల్టీఫ్లెక్స్‌లను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రవితేజ (ART) చేరిపోయాడు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story