మరో సినిమా మొదలు పెట్టిన రవితేజ

Ravi Teja
x
Ravi Teja
Highlights

కొన్ని నెలలు ఇండస్ట్రీకి దూరంగా ఉండి 'రాజా ది గ్రేట్' సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ మళ్లీ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు. 'టచ్ చేసి చూడు', 'నేల టికెట్' లాంటి సినిమాలు డిజాస్టర్ గా మారిన తర్వాత ఈ మధ్యనే విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోనీ' కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

కొన్ని నెలలు ఇండస్ట్రీకి దూరంగా ఉండి 'రాజా ది గ్రేట్' సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ మళ్లీ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు. 'టచ్ చేసి చూడు', 'నేల టికెట్' లాంటి సినిమాలు డిజాస్టర్ గా మారిన తర్వాత ఈ మధ్యనే విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోనీ' కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ప్రస్తుతం రవితేజ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి మంచి సినిమాతో హిట్ కొట్టాలని నిర్ణయించుకొని రవితేజ ఈ సినిమా మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళే లోపల మరొక సినిమా మొదలుపెడదామని డిసైడ్ అయ్యాడు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు రవితేజ. ఈ సినిమాలో కేథరిన్ తెరిసా హీరోయిన్. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఇది పూర్తి చేశాక రవి తేజ మళ్లీ విఐ సినిమాపై దృష్టి పెడతాడా లేక రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి కొనసాగిస్తాడా అనేది ఇంకా తెలియాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories