Rashmika Mandanna: రెమ్యునరేషన్ పెంచిన "పుష్ప" బ్యూటీ

Rashmika Mandanna: "పుష్ప" తర్వాత రెమ్యునరేషన్ పెంచేసిన స్టార్ హీరోయిన్

admin1
Updated on: 5 Jan 2022 7:01 PM IST
Rashmika Mandanna has Raised her Remuneration After Pushpa Movie  | Telugu Movie News
X

 రెమ్యునరేషన్ పెంచిన "పుష్ప" బ్యూటీ

Rashmika Mandanna: వరుస సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక హిందీలో కూడా మంచి కలెక్షన్ లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక ప్యాన్ ఇండియన్ నటి గా మారిపోయింది. నిజానికి రష్మిక మందన్న "మిషన్ మజ్ను" అనే సినిమాతో త్వరలో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. మరోవైపు "గుడ్ బై" అనే మరొక హిందీ సినిమాలో కూడా నటిస్తోంది.

"పుష్ప" సక్సెస్ తర్వాత ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అతి తొందర్లోనే రష్మిక మందన్న "పుష్ప" రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" షూటింగ్ మొదలు మొదలు పెట్టబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ మొదటి పార్ట్ కి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రెండవ భాగం కోసం 3 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మాత్రమే కాక రష్మిక మందన్న శర్వానంద్ హీరోగా నటిస్తున్న "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. రష్మిక రెమ్యూనరేషన్ పుష్ప సినిమా సక్సెస్ తర్వాత బాగానే పెరిగింది అని చెప్పచ్చు.

admin1

admin1

Next Story