Rashmika Mandanna: అమితాబ్ తో సినిమాపై రష్మీక వాళ్ళ అమ్మ రియాక్షన్ ఇదేనట

* "ఛలో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన ఇప్పుడు టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

admin1
Updated on: 15 Sept 2021 2:32 PM IST
Rashmika Mandanna Explains How Her Mother Reacted When i say Acting With Amitabh Bachchan in Goodbye Movie
X

అమితాబ్ బచ్చన్ - రష్మీక 

Rashmika Mandanna: "ఛలో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన ఇప్పుడు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కరియర్ లో ముందుకు దూసుకుపోతున్న రష్మిక మందన ఈ మధ్యనే కార్తీ హీరోగా నటించిన "సుల్తాన్" సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న "మిషన్ మజ్ను" సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను సైతం పలకరించడానికి సిద్ధమైంది.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న "గుడ్బై" సినిమాలో కూడా రష్మిక మందన్న ముఖ్యపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ తొలి సినిమా విడుదలకు ముందే తనకు "గుడ్బై" సినిమా ఆఫర్ వచ్చిందని అన్నారు. ఇక హోటల్స్ లో ఉండడం తనకి ఇష్టంలేదని, కష్టం అవడంతో ముంబై లో ఇల్లు కొనుక్కున్నట్టు తెలిపింది రష్మీక. ఇక లాక్ డౌన్ మొత్తం హైదరాబాదు లోనే ఉన్నాను అని ఆ సమయంలో తన తల్లిదండ్రులు కూర్గ్ లో ఉన్నారని చెప్పిన రష్మిక "గుడ్ బై" ఆఫర్ వచ్చిన వెంటనే హిందీ సినిమా సైన్ చేశానని ఇంట్లోవాళ్లకి చెప్పిందట. దాదాపు నెలన్నర తర్వాత కూర్గ్ వెళ్ళిన రష్మిక అమితాబ్ బచ్చన్ తో సినిమా చేస్తున్నాను అని చెప్పగా ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారట. "వాట్! బచ్చన్ సాబ్ తోనా" అని వాళ్ళ అమ్మ అడగగా రష్మిక చిన్నగా నవ్వేసిందట.

admin1

admin1

Next Story