Rashmika Mandanna: అనుకోకుండా ఆగిపోయిన రష్మిక హిందీ సినిమా

Rashmika Mandanna: అర్ధాంతరంగా ఆగిపోయిన రష్మిక బాలీవుడ్ సినిమా

Jyothi
Published on: 31 Aug 2022 11:47 AM IST
Rashmika is a Hindi Movie that Stopped Unexpectedly
X

Rashmika Mandanna: అనుకోకుండా ఆగిపోయిన రష్మిక హిందీ సినిమా

Rashmika Mandanna: వరుస సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ లో ముందుకు దూసుకుపోతోంది రష్మిక మందన్న. ఈ మధ్యనే "పుష్ప" సినిమాతో బాలీవుడ్ లో కూడా అందరి దృష్టిని ఆకర్షించిన రష్మిక "సీతారామం" సినిమాతో కూడా మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక మరోవైపు రష్మిక చేతుల్లో ఇప్పుడు కొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న "మిషన్ మజ్ను" సినిమాతో బాలీవుడ్ లో మొదటిసారిగా అడుగు పెట్టబోతున్న రష్మిక ఆ తరువాత "గుడ్ బై" అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఆ సినిమాలో ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇక మరోవైపు రష్మిక మందన్న టైగర్ ష్రాఫ్ హీరోగా కరణ్ జోహార్ నిర్మించే ఒక భారీ బడ్జెట్ సినిమాలో కూడా నటించడానికి సైన్ చేసింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా కోసం కరణ్ జోహార్ టైగర్ ష్రాఫ్ కి 35 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వవలసిందిగా అగ్రిమెంట్ ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల టైగర్ ష్రాఫ్ ని పారితోషికం తగ్గించుకోమని 20 కోట్ల తో పాటు సినిమాలో ప్రాఫిట్ లలో కొన్ని షేర్లు తీసుకోమని కరణ్ జోహార్ కోరారట. కానీ టైగర్ ష్రాఫ్ దీనికి ససేమిరా ఒప్పుకోకుండా సినిమాని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Jyothi

Jyothi

Next Story