Rashmi Rocket: 'రష్మీ రాకెట్' ఓటీటీలో ఫిక్స్?

Rashmi Rocket: క‌రోనా కార‌ణంగా అనేక సినిమాలు ఓటీటీ బాట‌ప‌ట్టాయి.

Samba Siva Rao
Published on: 3 Jun 2021 11:44 AM IST
Rashmi Rocket Movie Towards on OTT
X

Taapsee Pannu (Insta Photo )

Rashmi Rocket: క‌రోనా కార‌ణంగా అనేక సినిమాలు ఓటీటీ బాట‌ప‌ట్టాయి. బాలీవుడ్ సినిమాలు కూడా ఓటీటీ వైపు చూస్తున్నాయి. సల్మాన్ ఖాన్ , అభిషేక్ బచ్చన్, అక్షయ్ లాంటి దిగ్గజాలు ఓటిటి వేదికపై సినిమాలు రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే బాటలో మరో స్పోర్ట్స్ డ్రామా మూవీ రాబోతుందని స‌మాచారం. సౌత్ నుంచి బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది తాప్సీ పన్ను. బాలీవుడ్ లోని మోస్ట్ బిజీస్ట్ హీరోయిన్స్ లో తాప్సీ ఒక‌రు. ఈ భామ మొదటగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకొని అనంతరం బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది.

తాప్సీ న‌టించిన‌ బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా త్వరలోనే ఓటిటి రిలీజ్ కాబోతుందని సమాచారం. ప్రస్తుతం తాప్సీ 'రష్మీ రాకెట్' అనే పేరుతో సినిమా చేసింది. ఈ స్పోర్ట్స్ డ్రామాను ఆకర్ష్ ఖురానా తెరకెక్కించగా.. ప్రంజల్ ఖండ్డియా నేహా ఆనంద్ రోనీ స్క్రూవాలా సంయుక్తంగా మ్యాంగో పర్పుల్ మీడియా నెట్వర్క్ - ఆర్ఎస్విపి మూవీస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా గుజరాత్ రాష్ట్రానికి చెందిన అథ్లెట్ రష్మీ లైఫ్ స్టోరీ నేపథ్యంలో రూపొందింది. దేశవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కావాల్సిన సినిమా త్వరలోనే కరోనా సెకండ్ వేవ్ కారణంగా డిజిటల్ రిలీజ్ అవుతుందని వినికిడి.

ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ సినిమాల్లో రాకెట్ రష్మీ ఒకటి. మొదటగా ఈ సినిమా ఫస్ట్ లుక్ 2019లో రిలీజ్ చేసిన తాప్సీ.. ఈ ఏడాది జనవరిలో షూటింగ్ పూర్తి అయినట్లు సోషల్ మీడియాలో తెలిపింది. ఈ సినిమాను పూర్తిగా గుజరాత్ పరిసరాల్లోనే షూట్ చేసినట్లు తాజాగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమాని ఓటిటి రిలీజ్ చేయాలనీ మేకర్స్ పలు దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ లతో చర్చలు జరుపుతున్నారని స‌మాచారం.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story