గొడవలు అంటే చాలా ఇష్టం అంటున్న యాంకర్ రష్మీ

Bomma Blockbuster Teaser: జబర్దస్త్ తో పాటుగా పలు షోలలో కనిపిస్తూ బుల్లితెర పైన ఆదరగొడుతుంది యాంకర్ రష్మీ గౌతమ్.. ఇక అవకాశాలు వచ్చినప్పుడు వెండితెరపై కూడా కనిపిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది

Krishna
Published on: 2 Oct 2020 5:51 PM IST
గొడవలు అంటే చాలా ఇష్టం అంటున్న యాంకర్ రష్మీ
X

rashmi gautam 

Bomma Blockbuster Teaser: జబర్దస్త్ తో పాటుగా పలు షోలలో కనిపిస్తూ బుల్లితెర పైన ఆదరగొడుతుంది యాంకర్ రష్మీ గౌతమ్.. ఇక అవకాశాలు వచ్చినప్పుడు వెండితెరపై కూడా కనిపిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తాజాగా రష్మీ "బొమ్మ బ్లాక్ బస్టర్" అనే చిత్రంలో నటిస్తుంది.. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. రెండు ఆరు నిముషాలు ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ కి నటుడు శ్రీవిష్ణు వాయిస్‌ ఓవర్‌ అందించాడు.

ఇందులో నందు(పోతురాజు)గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి వీరాభిమానిగా నటిస్తున్నాడు.. తన జీవితాన్ని కథగా రాసి పూరీకి ఇవ్వాలని.. బతికినా, చచ్చినా తన జీవితకథ మాత్రం పూరీ డైరెక్షన్‌లో ఎప్పటికీ బతికే ఉండాలని అంటూ వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక తనకి గొడవలు జరుగుతుంటే చూడటం అంటే ఎంతో ఇష్టమని రష్మీ చెప్పే డైలాగ్ టీజర్ కి హైలెట్ గా నిలుస్తోంది. ఇందులో రష్మీ వాణి అనే పాత్రలో కనిపిస్తుంది

ఈ చిత్రం ద్వారా రాజ్ విరాట్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. విజయీభవ బ్యానర్‌పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందిస్తుండగా, రఘు కుంచె కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి.


Krishna

Krishna

Next Story