జబర్దస్త్ బ్యూటీని కరిగించిన నెటిజన్... నీ అడ్రస్ చెప్పమంటూ రష్మీ ట్వీట్!

Rashmi Gautam Helps : జబర్దస్త్ షో ద్వారా చాలా పాపులారిటీని సంపాదించుకుంది యాంకర్‌ రష్మీ గౌతమ్.. మంచి మంచి పాత్రలు వచ్చినప్పుడు

Krishna
Published on: 19 Sept 2020 2:06 PM IST
జబర్దస్త్ బ్యూటీని కరిగించిన నెటిజన్... నీ అడ్రస్ చెప్పమంటూ రష్మీ ట్వీట్!
X

rashmi gautam 

Rashmi Gautam Helps : జబర్దస్త్ షో ద్వారా చాలా పాపులారిటీని సంపాదించుకుంది యాంకర్‌ రష్మీ గౌతమ్.. మంచి మంచి పాత్రలు వచ్చినప్పుడు వెండితెర పైన కూడా మెరుస్తూ అలరిస్తుంది ఈ బ్యూటీ.. ఇక రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సామాజిక అంశాలపైన ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో జంతువులకి సంరక్షణ చూసుకుంటూ తన గొప్ప మనసును చాటుకుంటుంది. అయితే తాజాగా ఓ నెటిజన్ రష్మీని సహాయం కోరాడు.. నెటిజన్ ని కోరగానే రష్మి కరిగిపోయి అడ్రస్ పంపించు అంటూ కామెంట్స్ పెట్టింది.

"మేడమ్ దయచేసి నాకు సహాయం చేయండి. నేను పోటీ పరీక్షలకు కోసం ప్రిపేర్ అవుతున్నాను. డిసెంబర్ 15వ తేదీన నాకు పరీక్ష ఉంది. ఆ పరీక్షకు సన్నద్ధం కావడానికి రెండు పుస్తకాలు కావాలి. కానీ అవి కొనుక్కొనే స్థోమత నాకు లేదు. ఆ రెండు పుస్తకాలు కొనిస్తే నా విజయానికి మీరు కారణమవుతారు. ఈ జాబ్ నేను ఎలాగైనా సాధించాలి. దయచేసి సహాయం చెయ్యి అక్కా" అంటూ తనకి కావాల్సిన పుస్తకాలను జతపరిచాడు. దీనికి కరిగిపోయిన రష్మీ నీ అడ్రస్ చెప్పు.. వాటిని కొని మీకు పంపిస్తా" అంటూ ట్వీట్ చేసింది. ఇక రష్మీ చేసిన సహాయానికి నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.

ఇక రష్మీ కెరీర్ పరంగా చూసుకుంటే.. జబర్దస్త్ షో ద్వారా బాగా క్లిక్ అయిన రష్మీ.. ఢీ ఛాంపియన్స్ ద్వారా కూడా ఫేం సంపాదించుకుంది.. ఇక గుంటూరు టాకీస్ మొదలగు చిత్రాలలో నటించింది.. ఇక తాజాగా తను బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో నటిస్తుంది.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.



Krishna

Krishna

Next Story