అప్పుడే సుదీర్ తో సినిమా చేస్తా అంటున్న రష్మీ!

అప్పుడే సుదీర్ తో సినిమా చేస్తా అంటున్న రష్మీ!
x
Highlights

బుల్లితెర మీద జబర్దస్త్ కు ఉన్న పాప్యులారిటీ అందరికీ తెలిసిందే. కామెడీ షో లలో టాప్ ప్లేసులో ఏడేళ్ళుగా తన సత్తా నిరూపించుకుంటూ వస్తోంది. ఈ షో లాంటి షో...

బుల్లితెర మీద జబర్దస్త్ కు ఉన్న పాప్యులారిటీ అందరికీ తెలిసిందే. కామెడీ షో లలో టాప్ ప్లేసులో ఏడేళ్ళుగా తన సత్తా నిరూపించుకుంటూ వస్తోంది. ఈ షో లాంటి షో లు ఎన్ని వచ్చినా జబర్దస్త్ రేంజి ఏమాత్రం తగ్గలేదు. ఇక ఈ షో లో కొందరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్కిట్ లలో వాళ్ళ టాలెంట్ తో అందరి మనసుల్నీ దోచుకున్నారు. వారిలో సుడిగాలి సుదీర్ టీం ఒకటి. సుదీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ఈ ముగ్గురు కలిసి చేసే స్కిట్ లకు ప్రత్యేకమిన గుర్తింపు ప్రేక్షకుల్లో ఉంది.

ఇక స్కిట్ లు పక్కన పెడితే బుల్ల్లితెర మీద యాంకర్ గా జబర్దస్త్ షో తో వెలుగులోకి వచ్చిన రష్మి గురించి ఇక చెప్పక్కర్లేదు. ఈ షో తో పాటు మరో రెండు మూడు షో లతో బిజీగా ఉంది ఆమె. ఇక జబర్దస్త్ లో రశ్మీ..సుడిగాలి సుదీర్ ల మధ్య నడిచే కెమిస్ట్రీ గురించి వీక్షకుల్లో అందరికీ విపరీతమైన ఇంట్రస్ట్ ఉంది. వీరిద్దరూ స్కిట్ ల సమయంలో చేసే చిలిపి సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా ప్రేక్షకుల్లో వీరిద్దరి మధ్య ఉన్న క్రేజ్ ను గమనించిన షౌల నిర్వాహకులు వీరిద్దరి మధ్య ఎదో ఉందనేలాంటి స్కిట్ లు ఎన్నో వదిలారు.

ఇవన్నీ పక్కన పెడితే, సుడిగాలి సుదీర్ సాఫ్ట్ వేర్ సుదీర్ గా మారిపోయి వెండితెర మీద హీరోగా మెరిశాడు. ఇప్పుడు సుదీర్ టీం అంతా కల్సి 3 మంకీస్ అంటూ వెండితెర మీద హంగామా చేయడానికి సిద్ధం అయిపోయారు. వీరు ముగ్గురూ కల్సి చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరి 6న ఈ 3 మంకీస్ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

3 మంకీస్ సినిమా ప్రమోషన్ లో రష్మి కూడా తళుక్కుమంటోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది ఈ భామ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుదీర్, శ్రీను, రామ్ ప్రసాద్ ముగ్గురూ 3 మంకీస్ సినిమాలో అద్భుతంగా చేశారని చెబుతోంది. అంతే కాదు ఈ సినిమా లో వారు ముగ్గురూ ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేయనున్నారని అంటోంది. ఇక సుదీర్ తో తన బంధం గురించి చెబుతూ అతను తనకు మంచి స్నేహితుడని చెప్పుకోస్తోంది. ఇదిలా ఉండగా సుదీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుదీర్ సినిమాలో తనకి మొదట హీరోయిన్ గా అవకాశం వచ్చిందనీ, అయితే, ఖాళీ లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాననీ వివరిస్తోంది.

ఇక సుదీర్ కు తనకు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉందని రష్మి చెబుతోంది. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా చేయాలనీ, తామిద్దరూ కల్సి నటిస్తే అది ప్రేక్షకుల అంచనాలకు అందుకునే సినిమాగా ఉండాలని ఆమె చెప్పింది. కచ్చితంగా తామిద్దరం కల్సి నటిస్తామనీ అయితే అది ఒక లెవెల్ ఉన్న సినిమా అయివుందాలనీ సెలవిస్తోంది రష్మీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories