Bollywood: డిసెంబర్లో పెళ్ళికి రెడీ అవుతున్న బాలీవుడ్ స్టార్ జంట

Bollywood: ఈ ఏడాది ఆఖరులో పెళ్లిపీటలెక్కనున్న రన్బీర్ కపూర్ మరియు అలియాభట్

admin1
Updated on: 26 Oct 2021 8:30 PM IST
Ranbir Kapoor and Alia Bhatt Plans to Marry in December
X

డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్న రన్బీర్ కపూర్ అలియా భట్ (ఫైల్ ఇమేజ్)

Bollywood: బాలీవుడ్ స్టార్ కపుల్ రన్బీర్ కపూర్ మరియు అలియాభట్ గత రెండేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా వీరిద్దరు డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇద్దరు స్టార్ నటీనటులు కూడా సినిమా పనులను పక్కనపెట్టి మళ్లీ 2022 నుంచి మాత్రమే సినిమా షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. నిజానికి అర్జున్ రెడ్డి ఫిలిం డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ "యానిమల్" సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఈ షూటింగ్ ని రన్బీర్ కపూర్ వచ్చే ఏడాది మొదటి కి వాయిదా వేశారు.

మరోవైపు ప్రస్తుతం తన చేతిలో ఉన్న "ఆర్ ఆర్ ఆర్" మరియు "గంగూ భాయ్" షూటింగ్ లను పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో వచ్చే ఏడాది నుంచి మాత్రమే పాల్గొన్న బోతుంది ఆలియా భట్. ఈ నేపథ్యంలోనే అలియా భట్ మరియు రణబీర్ కపూర్ ఏడాది ఆఖరులో పెళ్లిపీటలెక్కనున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్ల లాగా ఆలియా కూడా గుర్తు తెలియకుండా పెళ్లి చేసుకుంటుందా లేక త్వరలోనే తన పెళ్లి గురించి అధికారిక ప్రకటన ఇస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

admin1

admin1

Next Story