Rana-Mahika Wedding Card Viral: రానా, మహిక పెళ్లి పత్రిక వచ్చేసింది!

Rana-Mahika Wedding Card Viral: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉంటున్న యంగ్ హీరోలందరూ మెల్లిమెల్లిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే నిఖిల్

Krishna
Published on: 24 July 2020 12:48 PM IST
Rana-Mahika Wedding Card Viral: రానా, మహిక పెళ్లి పత్రిక వచ్చేసింది!
X
rana daggubati- mihika bajaj wedding card viral in social media

Rana-Mahika Wedding Card Viral: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉంటున్న యంగ్ హీరోలందరూ మెల్లిమెల్లిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే నిఖిల్ ఓ ఇంటివాడు కాగా, ఈ నెల చివర్లో నితిన్ పెళ్లి జరుగుతుంది. ఇక త్వరలో రానా కూడా ఓ పెళ్లి చేసుకోబోతున్నాడు. లాక్ డౌన్ సమయంలో తను నాకు ఎస్ చెప్పింది అంటూ తన ప్రేయసి మహికను అందరికి పరిచయం చేశాడు రానా.. ఇక వీరి ప్రేమకి ఇరువురు కుటుంబ సభ్యులు కూడా పచ్చాజెండా ఉపేశారు.

ఇక మే మే 21వ తేదీన రానా, మిహిక కుటుంబాలు రాకా ఫంక్షన్ ఫంక్షన్ నిర్వహించి త్వరలో పెళ్లి ఉంటుందని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఆగస్టు 8 న పెళ్లిని కన్ఫర్మ్ చేస్తూ పెళ్లిపత్రికను ఆఫీషియల్ గా రిలీజ్ చేశారు. అయితే అందరిలా కాకుండా పెళ్లి పత్రికను ఓ వీడియోగా రూపొందించారు. పాత సినిమా మాయాబజార్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని జత చేస్తూ రానా, మిహికాల ఫొటోలతో ఆసక్తికరంగా రూపొందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇందులోనే ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండ, హైదరాబాద్‌లో రానా- మిహికా వివాహం జరుగుతుందని ఈ పత్రిక ద్వారా వెల్లడించారు. కరోనా సమయంలో జరుగుతున్న పెళ్లి కావడంతో ఈ వివాహ వేడుకకి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈ పెళ్లి జరగనుంది.

అటు రానా సినిమాల విషయానికి వచ్చేసరికి.. ప్రస్తుతం రానా అరణ్య అనే ఓ సినిమాలో నటిస్తున్నాడు. విడుదలకి సిద్దంగా ఉన్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో పాటుగా విరాటపర్వం అనే సినిమాని చేస్తున్నాడు రానా.

Krishna

Krishna

Next Story