ఒక సినిమా.. వంద వివాదాలు.. వంద వివాదాలు.. ఓ సినిమా ప్రచారం.. ఇదీ ఆర్జీవీ స్టైల్! రూపాయి ఖర్చు లేకుండా లక్షల రూపాయల ప్రచారం చేయాలంటే రామ్ గోపాల్ వర్మ...
ఒక సినిమా.. వంద వివాదాలు.. వంద వివాదాలు.. ఓ సినిమా ప్రచారం.. ఇదీ ఆర్జీవీ స్టైల్! రూపాయి ఖర్చు లేకుండా లక్షల రూపాయల ప్రచారం చేయాలంటే రామ్ గోపాల్ వర్మ తరువాతే ఎవరైనా. వినోదం నుంచి వివాదాన్నీ.. వివాదం నుంచి ప్రచారాన్నీ నేర్పుగా చేయగలవాడు ఎవరని అడిగితే వెంటనే వచ్చే జవాబు వర్మ అనే అంటే అతిశయోక్తి కాదు.
పూరీ జగన్నాధ్.. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు. పాపం చాలా కాలంగా హిట్ లేక డీలా పడిపోయారు. ఈ మధ్యనే ఇస్మార్ట్ శంకర్ పేరుతో ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఓ మంచి మాస్ మసాలా సినిమా తీసి వదిలారు. అది విడుదల రోజునే మాస్ హిట్ గా పేరుతెచ్చుకుంది. ఈ క్రమంలో ఆ సినిమాకి ప్రచారం చేయడానికి.. తన శిష్యుడికి సపోర్ట్ చేయడానికి అర్జీవీ రంగంలోకి దిగారట. హైదరాబాద్ లో మొన్న శనివారం అంతా హంగామా సృష్టించారు. ఎదో సినిమాలో కత్తి వాడటం అంటూ మొదలెడితే నన్ను మించినోడు లేడు అని ఓ డైలాగ్ వుంటుంది. ఆ తరహాలో నేను ప్రచారానికి వాడాలనుకుంటే ఎవరినైనా వాడగలను అనేది రామ్ గోపాల్ వర్మ పద్ధతి. సరిగ్గా ఇదే చేశాడంటున్నారు టాలీవుడ్ జనాలు.
ముగ్గురితో బైక్ మీద ఎక్కి మూసాపేటలో హడావుడి చేశారు. దానిని వీడియో తీసి ట్విట్టర్ లో ఉంచారు. అంతదాకా బాగానే ఉంది.. నన్నెవరూ పట్టుకోలేదు అంటూ ట్రాఫిక్ పోలీసులను టార్గెట్ చేసి ఓ రెండు మాటలు రాసిపారేశారు. అంతే ఆ రెండు మాటలు.. సినిమాకి కావలసినదానికన్నా ఎక్కువగానే పబ్లిసిటీ తెచ్చిపాదేశాయి. అంతే కాదు సినిమా చూసి వచ్చిన దగ్గర నుంచీ.. రాము నుంచి ట్వీట్ల వర్షం ఆగడం లేదు. ఇవి నెట్టింట్లో ఫుల్ గా షికార్లు చేసేస్తున్నాయి. అదండీ సంగతి.. సినిమా తీయడం కాదు.. సినిమా ప్రచారమూ ముఖ్యమే. అదీ పైసా ఖర్చు లేకుండా! ఇప్పుడు జనం ఇస్మార్ట్ శంకర్ తీసింది పూరీ అనే సంగతి మర్చిపోయేలా ఉన్నారన్నది కొసమెరుపు!
రాంగోపాల్ వర్మ ఇస్మార్ట్ శంకర్ కోసం చేసిన ట్వీట్లు మీకోసం.. ఎంజాయ్ చేయండి!
Where is the Police? ..I think they are all inside the theatres watching #issmartshankar @purijagan @Charmmeofficial @ramsayz @NabhaNatesh @AgerwalNidhhi pic.twitter.com/YrItS0O6wh
— Ram Gopal Varma (@RGVzoomin) July 20, 2019
Going in to theatre to see #Issmartshankar a second time @purijagan @Charmmeofficial @ramsayz @NabhaNatesh @AgerwalNidhhi pic.twitter.com/wM4mdSfWRR
— Ram Gopal Varma (@RGVzoomin) July 20, 2019
MY PERSONAL PUBLIC REVIEW ON #issmartshankar @purijagan https://t.co/7JuN70xkSq
— Ram Gopal Varma (@RGVzoomin) July 21, 2019
Watch Super Star @rajinikanth 's reaction to #issmartshankar SUCCESS PARTY @purijagan @Charmmeofficial @ramsayz @AgerwalNidhhi @NabhaNatesh pic.twitter.com/I3vNPEjKva
— Ram Gopal Varma (@RGVzoomin) July 21, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire