పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? వర్మ తాజా ట్రైలర్!

పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? వర్మ తాజా ట్రైలర్!
x
కమ్మరాజ్యంలో కడప రెడ్లు తాజా ట్రైలర్
Highlights

వివాదం తోనే విజయం ఇదీ రామ్ గోపాల్ వర్మ సిద్ధాంతం.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు తాజా ట్రైలర్ మరింత వేడెక్కిస్తోంది!

వివాదం..రామ్ గోపాల్ వర్మ ఈ రెండూ సహోదరులు. వివాదం నుంచి వినోదాన్ని పిండుకోవడం.. వివాదాన్ని పెంచి కాసులు కుమ్ముకోవడం ఇదే విద్యతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనుగడ సాగిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. తెలుగు సినీ చరిత్రలో..ఆ మాట కొస్తే భారత సినీ చరిత్రలోనే వివాదాలే కథలుగా తెరను నింపి సొమ్ములు మూటగట్టుకున్న దర్శకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాబోదు. మాఫియా నుంచి రాజకీయాల వరకూ మామూలు విషయాన్ని కూడా వివాదాస్పదంగా చూపించడంలో అర్జీవీని మించిన వారు లేరనేది అందరికీ తెలిసిందే!

ఇప్పుడు తాజాగా రామ్ గోపాల్ వర్మ కులాల పేర్లనే సినిమా టైటిల్ గా వాడుకుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రతిబింబించే లా ''కమ్మ రాజ్యం లో కడప రెడ్లు'' అనే సినిమా సిద్ధం చేస్తున్నారు ఆర్జీవీ. ఇప్పటికే ఈ సినిమా పాటలు.. టీజర్లు.. ట్రైలర్ లతో కావలసినంత వేడి పుట్టించారు. ఈ సినిమాని ఈ నెల 29 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొత్తగా ఇంకో ట్రైలర్ వదిలారు వర్మ.

ఓడిపోయిన పార్టీకి చెందిన తండ్రీ కొడుకులు అంటూ మొదలైన ఈ ట్రైలర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను అని సీఎం ను పోలిన పాత్రధారి చెబుతున్న డైలాగుతో ముగిసింది. ఈ రెండు సన్నివేశాల మధ్య వచ్చిన బిట్స్ ప్రతీదీ వర్మ రగిలిన్చాబోయే రచ్చను చూపించాయి. మన పార్టీ ఇంకో ఐదేళ్ళు మనుగడ సాధించడం కష్టమే అని ఒకాయన అంటే.. ఈ లోపు ఆ పొట్టోడు పార్టీని లాగేసుకోకుండా ఉంటె అనే డైలాగు వినిపించింది.. మరి ఆ పొట్టోడు ఎవరో.. ఆ పార్టీ ఏదో ఎవరికీ వారు ఊహించేసుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ పాత్ర దారి నిడివి ఎక్కువగా ఈ ట్రైలర్ లో ఉంది. అందులో భాగంగా ఓ పాత్ర ధారి నాకో ఐడియా వచ్చింది.. పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేసేస్తే అని ఆడుగుతూ కనిపిస్తున్నాడు.

ఇలా రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రంతో వర్తమాన రాజకీయాల భూత భవిష్యత్ ల కలయికలతో ప్రచారంతోనే హీట్ పుట్టించడంలో సఫలీకృతుడయ్యారు రామ్ గోపాల్ వర్మ. ఇంతకీ ఆ ట్రైలర్ మీరు చూశారా లేదా.. ఆలస్యం ఎందుకు చూసేయండి మరి!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories