మెగా అభిమానులకు డబుల్ ధమాకా! చిరు 152 వ సినిమాలో రామ్ చరణ్!

మెగా అభిమానులకు డబుల్ ధమాకా! చిరు 152 వ సినిమాలో రామ్ చరణ్!
x
Highlights

మెగా అభిమానుల పెద్ద కల చిరంజీవి, రామ్ చరణ్ కల్సి ఓ సినిమాలో చేయాలని. దానిని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడాలని. ఆ కోరిక త్వరలో నెరవేరబోతున్నట్టు...

మెగా అభిమానుల పెద్ద కల చిరంజీవి, రామ్ చరణ్ కల్సి ఓ సినిమాలో చేయాలని. దానిని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడాలని. ఆ కోరిక త్వరలో నెరవేరబోతున్నట్టు తెలుస్తోదని. మెగాస్టార్ హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్ పై మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలసి రామ్ చరణ్ నిర్మించనున్న చిరు 152 వ సినిమా షూటింగ్ ముహూర్తం కొద్దిసేపటి క్రితం జరిగింది. ఇది అభిమానులకు దసరా కానుకగా భావించారు. అయితే, అంతకు మించిన కనుక ఈ సినిమాతో అభిమానులకు ఇస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. అదే.. చిరుతో కలసి రామ్ చరణ్ నటించే అవకాశము ఉండనే వార్తా ఇప్పుడు టాలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది.

కొరటాల శివ స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమా సోషల్ మెసేజ్ తో రూపొందుతోందని.. దీనిలో అతి ముఖ్యమైన ఒక పాత్రని రామ్ చరణ్ చేస్తున్నారనీ వినిపిస్తోంది. సో, చిరు 152 వ సినిమా ప్రారంభం కావడం అభిమానులకు డబుల్ ధమకనే.. కాదనగలరా?

Show Full Article
Print Article
More On
Next Story
More Stories