Vishwambhara: ట్రెండింగ్‌లోకి విశ్వంభ‌ర సాంగ్.. సోష‌ల్ మీడియాలో దుమ్మురేపుతోన్న చిరు క్రేజ్‌..!

Rama Rama Song From Chiranjeevis Vishwambhara Crosses 25 Million Views
x

Vishwambhara: ట్రెండింగ్‌లోకి విశ్వంభ‌ర సాంగ్.. సోష‌ల్ మీడియాలో దుమ్మురేపుతోన్న చిరు క్రేజ్‌..!

Highlights

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ (Viswambhara Movie) సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ (Viswambhara Movie) సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బింబిసారతో సంచలనం సృష్టించిన దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘రామ రామ’ సాంగ్‌తో మ్యూజిక్ ప్రమోషన్స్ గ్రాండ్‌గా ప్రారంభం

ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ఆసక్తికరంగా ప్రారంభించారు. మొదటి సింగిల్ ‘రామ రామ’ సాంగ్ ఇటీవల విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ను సాధించింది. “జై శ్రీ రామ్” నినాదం ప్రతిధ్వనించే ఈ పాట, విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే యూట్యూబ్ మ్యూజిక్‌లో 25 మిలియన్ వ్యూస్‌ను దాటి, టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

చిరంజీవి డాన్స్, కీరవాణి మ్యూజిక్‌కు అద్భుతమైన స్పందన

ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి డాన్స్ మ్యూవ్‌లు, ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం, రామజోగయ్య శాస్త్రి పవర్‌ఫుల్ లిరిక్స్, మ్యాసివ్ సెట్ డిజైన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీకి డీవోపీ చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైన్‌కు ఎఎస్ ప్రకాష్ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

విశ్వంభర సినిమా 2025లో విడుదలకు సిద్ధమవుతూ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీస్‌ లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. చిరంజీవి ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌ అందరూ ఈ సినిమాను భారీ ఎక్సైట్మెంట్‌తో ఎదురుచూస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories