Chiranjeevi: చిరుకి చెల్లిగా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Chiranjeevi: చిరుకి చెల్లిగా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?
x

Chiranjeevi: చిరుకి చెల్లిగా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Highlights

క్రీడ‌లు, రాజకీయాలో పాటు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపించేది సినిమాలు అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. కేవ‌లం సినిమాల‌ను చూడ‌డానికి మాత్ర‌మే ప‌రిమితం కాకుండా సినిమాల విశ్లేష‌ణ‌లో కూడా ప్రేక్ష‌కులు భాగ‌స్వామ్య‌మ‌వుతుంటారు.

క్రీడ‌లు, రాజకీయాలో పాటు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపించేది సినిమాలు అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. కేవ‌లం సినిమాల‌ను చూడ‌డానికి మాత్ర‌మే ప‌రిమితం కాకుండా సినిమాల విశ్లేష‌ణ‌లో కూడా ప్రేక్ష‌కులు భాగ‌స్వామ్య‌మ‌వుతుంటారు. సినిమాల‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు.

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇట్టే వైర‌ల్ అవుతున్నాయి. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హీరోహీరోయిన్ల‌కు వ‌య‌సు విష‌యంలో చాలా వ్య‌త్యాస‌ముంటుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.


అల‌నాటి అందాల తార శ్రీదేవీ సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు మ‌న‌వ‌రాలిగా, హీరోయిన్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. చిరు విషయంలో కూడా ఇలాంటి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం ఉంద‌ని మీకు తెలుసా.? చిరుకు చెల్లిగా, హీరోయిన్‌గా న‌టించింది ఓ హీరోయిన్‌. ఇంత‌కీ ఆ బ్యూటీ మ‌రెవ‌రో కాదు అందాల తార న‌య‌న‌తార‌. 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో చిరంజీవి భార్యగా, 'గాడ్ ఫాదర్'లో చెల్లిగా నటించిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఇదిలా ఉంటే చిరు ప్రాజెక్టుల విష‌యానికొస్తే.. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న చిరు ప్ర‌స్తుతం 'విశ్వంభర' అనే కొత్త సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ కూడా పాత్ర పోషిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వశిష్ట, 'కళ్యాణ్ రామ్' హీరోగా చేసిన బింబిసార సినిమాతో మంచి విజయాన్ని సాధించారు. 'విశ్వంభర' ఫాంటసీ కథతో తెర‌కెక్కుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories