అన్నీ అడుగుతున్నారు కానీ, అది మాత్రం అడగడం లేదు... హీరో రామ్

అన్నీ అడుగుతున్నారు కానీ, అది మాత్రం అడగడం లేదు... హీరో రామ్
x
Highlights

రామ్ తాజా సినిమా ఇస్మార్ట్ శంకర్. మంచి టాక్ తో దూసుకుపోతోంది. సినిమా పూర్తిగా పూరీజగాన్నాద్ స్టైల్ మాస్ సినిమా అని హీరో రామ్ మొదట్నుంచీ చెబుతూనే...

రామ్ తాజా సినిమా ఇస్మార్ట్ శంకర్. మంచి టాక్ తో దూసుకుపోతోంది. సినిమా పూర్తిగా పూరీజగాన్నాద్ స్టైల్ మాస్ సినిమా అని హీరో రామ్ మొదట్నుంచీ చెబుతూనే ఉన్నారు. దానికి తోడు తన ఇస్మార్ట్ శంకర్ పేరుతో పెట్టిన ట్విటర్ పేజీలో కూడా సినిమా విడుదల కు ముందునుంచీ ట్వీట్ లు చేస్తూ వస్తున్నాడు. అయినా అందరూ హీరో హెల్మెట్ పెట్టుకోలేదు.. సిగరెట్ తాగుతున్నాడు.. ఇలాంటివి ఎలా ప్రోత్సహిస్తారు? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విమర్శలతో దాడి చేస్తున్నారు. హీరోకి, దర్శకుడికి బాధ్యత లేదా అని అడుగుతున్నారు. కానీ, ఎవరూ కూడా హీరో అంతమందిని చంపేస్తున్నాడు.. సినిమాలో అంత రక్తపాతమేమిటి? అని ప్రశ్నించలేదు.

సరిగ్గా ఈ విషయం మీద రామ్ ఇప్పుడు ఓ ట్వీట్ చేశాడు. అదిప్పుడు నెట్టింట్లో సంచలనం అవుతోంది. ''హీరో సిగరెట్ తాగుతున్నాడు.. హీరో హెల్మెట్ లేకుండా తిరుగుతున్నాడు.. హీరో అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు.. ఎంత సేపూ ఇవేకానీ, అక్కడ హీరో అడ్డమొచ్చిన వాళ్ళందర్నీ చంపేస్తున్నాడు అని ఒక్కడు కూడా కంప్లైంట్ చేయలేదు.. నో వాల్యూ ఫర్ లైఫ్..సాడ్'' అంటూ రామ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories