మళ్లీ అదే భాష మాట్లాడనున్న రామ్

మళ్లీ అదే భాష మాట్లాడనున్న రామ్
x
Highlights

ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు కూడా అందుకోని హీరోలలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఒక్కడు. ఈ మధ్యనే 'హలో గురు ప్రేమకోసమే' సినిమాతో ఫ్లాప్ అందుకున్న రామ్ తనలాగానే...

ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు కూడా అందుకోని హీరోలలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఒక్కడు. ఈ మధ్యనే 'హలో గురు ప్రేమకోసమే' సినిమాతో ఫ్లాప్ అందుకున్న రామ్ తనలాగానే ఫ్లాప్ సినిమా లతో సతమతమవుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లో ఒక పక్క హైదరాబాదీ అబ్బాయి గా కనిపించనున్నాడు. అంతేకాక అతని పాత్ర కూడా తెలంగాణ యాసలో మాట్లాడుతుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ మరియు నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. చార్మి మరియు పూరి సంయుక్తంగా ఈ సినిమాను పూరి కనెక్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తవగానే రామ్ 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ చంద్ర తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందట. అంతేకాక మళ్లీ ఈ సినిమాలో కూడా రామ్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడు. రామ్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ స్రవంతి మూవీస్ ఈ సినిమాను నిర్మించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories