Ram Gopal Varma: 'మా' పై రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

* 'మా' అసోసియేషన్‌ను సర్కస్‌తో పోల్చిన ఆర్జీవీ * 'మా' సభ్యులంతా జోకర్స్ అంటూ ట్వీట్

Shilpa
Published on: 19 Oct 2021 11:58 AM IST
Ram Gopal Varma Sensational Tweets on Movie Artist Association
X

రామ్ గోపాల్ వర్మ (ఫైల్ ఫోటో)

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఓ విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. రాజకీయ నాయకులు, సినీ తారల పై కూడా కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా మా ఎన్నికల వివాదంపై ఆర్జీవీ తనదైన స్టైల్‌లో స్పందించారు. మా అసోసియేషన్ సర్కస్ అని రెండు రోజుల కింద ట్వీట్ చేసిన వర్మ, తాజాగా మా వివాదంపై మరో పోస్ట్ చేశారు. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



Shilpa

Shilpa

Next Story