RGV Tweet: చిరంజీవి తర్వాత మెగాస్టార్ అల్లు అర్జునే అంటున్న ఆర్జీవి

admin1
Updated on: 24 Aug 2021 12:51 PM IST
RGV Tweet: RGV Sensational Comments on Allu Arjun and Mega Star Chiranjeevi
X

చిరంజీవి అల్లు అర్జున్ పై కామెంట్లు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ 

RGV Tweet on Allu Arjun: రాంగోపాల్ వర్మ.. ఈ పేరు తెలియనివారు ఇండస్ట్రీలో ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న వర్మ ప్రస్తుతం వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతం అవుతున్నారు. అయితే సినిమాల విషయంలో కాకపోయినా ఆర్జివి వివాదాస్పద కామెంట్లతో ఎప్పటికప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటు వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. తాను మెగా ఫ్యామిలీ కి పెద్ద అభిమానిని అంటూనే రాంగోపాల్ వర్మ చిరంజీవి మరియు ఇతర మెగా హీరోలపై ఎప్పటికప్పుడు ఏదో ఒక కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.


"ఒరిజినల్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఒకే ఒక్క ప్రజెంట్ మెగాస్టార్ అల్లు అర్జున్ మాత్రమే," అని రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉన్నట్టుండి బన్నీ పైన అంత ప్రేమ ఎందుకు కలిగింది అంటూ అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. అయితే సమయం సందర్భం లేకుండా వర్మ ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు.

అదే నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ మరియు చిరంజీవి పై ఇలా కామెంట్లు విసిరారు అంటూ కొంతమంది చెబుతున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ మధ్యనే విడుదలైన "దెయ్యం" సినిమా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే.


admin1

admin1

Next Story