సిద్ధిపేట లో షూటింగ్ చేస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' బృందం

సిద్ధిపేట లో షూటింగ్ చేస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ బృందం
x
Highlights

ఎప్పుడు వివాదాలకు దగ్గరగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ తో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే....

ఎప్పుడు వివాదాలకు దగ్గరగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ తో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ చూస్తేనే ఈ సినిమా కథ నందమూరి తారకరామారావు గారి రెండవ భార్య లక్ష్మీపార్వతి ఎంట్రీ నుంచి మొదలవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇంకొన్ని రోజులు షూటింగ్ చేస్తే అన్ని షెడ్యూల్స్ పూర్తి అయిపోతాయి. తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం షూటింగ్ షెడ్యూల్ ను సిద్ధిపేట లో నిన్నటి నుంచి మొదలు పెట్టిందని తెలుస్తోంది.

ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్లు నటిస్తున్నారు అయినప్పటికీ ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుంచి బీభత్సమైన పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. ఇక సినిమా కూడా అంతే మంచి టాక్ తో నడుస్తుందని అందరు అనుకుంటున్నారు. రాకేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 22 వ తారీఖు న విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories