తన తల్లికి మరువలేని బహుమతి ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

తన తల్లికి మరువలేని బహుమతి ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ
x
Highlights

వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏకంగా నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 'కోబ్రా' అనే సినిమాలో ఒక ముఖ్య పాత్ర...

వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏకంగా నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 'కోబ్రా' అనే సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆర్జీవి తాజాగా తన పుట్టినరోజు నాడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదల వేడుకలో పాల్గొన్న వర్మ కేక్ ను కూడా కట్ చేశారు. మొట్టమొదటి సారిగా తన జీవితంలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న వర్మ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తన తల్లి సూర్యమ్మను కూడా తీసుకువచ్చారు. ఈ వేడుకలో పాలుపంచుకున్న సూర్యమ్మ తన తనయుడు అయిన ఆర్జివి గురించి మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ సినిమాలో నటిస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

"నేనెప్పుడూ మా రాముని ఏదైనా సినిమాలో ఒక మంచి పరిణితి ఉన్న పాత్ర చేయమని అడుగుతూ ఉండేదాన్ని. కానీ తను ఏం మాట్లాడేవాడు కాదు. అలా అడిగి అడిగి ఊరుకున్నాను. కానీ ఇప్పుడు తను 'కోబ్రా' చిత్రాన్ని ప్రకటించటం నాకు ఒక బహుమతి లాంటిది. ఇలాంటి గిఫ్ట్ ఏ తల్లికి అందిఉండదేమో" అని అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ తనకు పుట్టిన రోజులు అంటే గిట్టదని ఎందుకంటే అవి ఒక సంవత్సరం ఓల్డ్ అయ్యామనే సీలింగ్ను తీసుకు వస్తాయి అని చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories