Top
logo

వివాదమే ఉండదన్న రాము.. ఉన్నదంతా అదే అంటున్న జనం!!

వివాదమే ఉండదన్న రాము.. ఉన్నదంతా అదే అంటున్న జనం!!
Highlights

నిన్ననే అసలు వివాదం అనేదే లేకుండా సినిమా పాట ట్రైలర్ విడుదల చేస్తున్ననన్నాడు అర్జీవీ. కానీ, మొదటి పాట మొదటి పదంలోనే వివాదాన్ని ఎలా చేయొచ్చో చూపించాడు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతో రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నానని చెప్పిన వర్మ ఇప్పుడు ఆ సినిమాలోని మొదటి పాత ప్రోమో విడుదల చేసి సంచలనం సృష్టిస్తున్నారు.

నిన్ననే అసలు వివాదం అనేదే లేకుండా సినిమా పాత ట్రైలర్ విడుదల చేస్తున్ననన్నాడు అర్జీవీ. కానీ, మొదటి పాట మొదటి పదంలోనే వివాదాన్ని ఎలా చేయొచ్చో చూపించాడు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతో రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే, నిన్న ఈ సినిమాకి సంబంధించి పాట ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదల చేస్తానన్నారు రాము. ఇప్పుడు విడుదల చేశారు. ఒక్క పాటలో.. ఒక్క ముక్కలో.. వున్న విజువల్స్ కి ఒక్క గంటలో వేలాది వ్యూస్ వచ్చిపడ్డాయి. అదీ రాం మార్క్ పబ్లిసిటీ అంటే అంటున్నారు నెటిజన్లు.

కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని పాట మొదలైంది. విజువల్స్ జగన్ సీఎం గా ప్రమాణం చేస్తున్న సీన్ తో మొదలెట్టారు. కత్తులు లేవిపుడు.. చిందే నెత్తురు లేదిపుడు.. యుద్ధం చేసే పద్ధతి మొత్తం మారిందీ ఇపుడూ.. కొత్త యుద్ధం. ఇది కొత్త యుద్ధం అంటూ పాట సాగింది. ఇక విజువల్స్ అయితే.. బీభత్సంగా ఉన్నాయి. మొదటి అసెంబ్లీలో బాబు-జగన్ వాగ్యుద్ధం.. స్పీకర్ తమ్మినేని సీతారాం సభను ఆర్డర్ లో పెట్టడం.. ఇలా వరుసగా పెర్చేశారు. ఇక పాత లిరిక్స్ చాలా బావున్నాయి. కానీ, చాలా వివాదాన్ని రేకెత్తించేలా ఉన్నాయి.

ఎపుడు ఎక్కడ ఎలా సొమ్ము చేసుకోవాలో ఆర్జీవీకి తెలిసినంత ఎవరికీ తెలీదు. అది మరోసారి రుజువైంది. కరెంట్ టాపిక్ ని ముందు పెట్టి.. బ్యాక్ గ్రౌండ్ లో తాను తీస్తున్న సినిమా పాట పెట్టి ప్రోమో చాలా ఇంటిలిజెంట్ గా కట్ చేశారు. ఇది ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మొత్తమ్మీద ఈపాట సంచలనం సృష్టిస్తోంది. వివాదాలూ ఇక దాని వెనుకే వస్తాయి అది ఆర్జీవీ స్టైల్ కదా!


Next Story