రామ్ చరణ్ పాత్రలో మూడు వేరియేషన్

రామ్ చరణ్ పాత్రలో మూడు వేరియేషన్
x
Highlights

'బాహుబలి' సినిమా తర్వాత ప్రస్తుతం అందరి కళ్ళు 'ఆర్ ఆర్ ఆర్' పైన ఉన్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి...

'బాహుబలి' సినిమా తర్వాత ప్రస్తుతం అందరి కళ్ళు 'ఆర్ ఆర్ ఆర్' పైన ఉన్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా అనౌన్స్ చేసినప్పటినుండి సినిమా కథ గురించి మరియు పాత్రల గురించి బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు మూడు షేడ్లు ఉంటాయట. మొదట బ్రిటీష్ ఆఫీసర్ గా తరువాత మాస్ లీడర్ గా ఆ తర్వాత స్వాతంత్ర సమర యోధుడిగా రామ్ చరణ్ పాత్ర ఉంటుందట. ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రలో రామ్ చరణ్ కనిపించడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా బోలెడు పేర్లు వినిపిస్తున్నప్పటికీ చిత్రబృందం మాత్రం ఇంకా అధికారిక ప్రకటనను ఇవ్వలేదు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories