'నేను కూడా బయోపిక్ కోసం ఎదురుచూస్తున్నా' అంటున్న చెర్రీ

'రంగస్థలం' సినిమా తో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ తో మళ్ళీ మనముందుకి రాబోతున్నాడు.

Ruthvik
Published on: 7 Jan 2019 5:04 PM IST
Ram Charan
X
Ram Charan

'రంగస్థలం' సినిమా తో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ తో మళ్ళీ మనముందుకి రాబోతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి 11 న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి రెండు రోజుల ముందు ఎన్టీఆర్ బయోపిక్, తరువాత రోజే 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమా విడుదల అవనున్నాయి. కనుక ఈ మూడు సినిమాలకు మధ్యలో బాక్సాఫీస్ వద్ద పెద్ద పోరే జరగనుంది.

ఈ విషయమై మాట్లాడుతూ సంక్రాంతి సినిమాల సీజన్ అని రెండు లేదా మూడు సినిమాలు వచ్చినా, బావుంటే అవి కచ్చితంగా హిట్ అయి తీరుతాయని అంటున్నాడు రామ్ చరణ్. ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాట్లాడుతూ "ఎన్టీఆర్ బయోపిక్ చాలా ప్రతిష్టాత్మకంగా, కష్టపడి తీశారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు నేను కూడా అంతే గౌరవం తో సినిమా కోసం ఎదురు చూస్తున్నాను" అన్నాడు చెర్రీ. ఇక తన కజిన్ వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్ 2' సినిమా గురించి మాట్లాడుతూ, "కామెడీ పరంగా వెంకటేష్ గారిని ఎవరు మించలేరు. మరి వెంకీ గారితో స్క్రీన్ పైన నటిస్తూ వరుణ్ తేజ్ ఎలా నటించాడో నాకు కూడా చూడాలని ఉంది" అని అన్న మెగా పవర్ స్టార్ ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నాడు.

Ruthvik

Ruthvik

Next Story