ఇన్స్టాగ్రామ్ సీక్రెట్ చెప్పిన చెర్రీ

ఈ మధ్య సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియాలో వారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. మహేష్ బాబు నుండి శర్వానంద్ వరకు టాలీవుడ్ లో హీరోలందరూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

Ruthvik
Published on: 10 Jan 2019 10:56 AM IST
Ram Charan
X
Ram Charan

ఈ మధ్య సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియాలో వారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. మహేష్ బాబు నుండి శర్వానంద్ వరకు టాలీవుడ్ లో హీరోలందరూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పటిదాకా అధికారిక ఎకౌంట్ లేని ఒకే ఒక స్టార్ హీరో రామ్ చరణ్. ఇప్పటికే రామ్ చరణ్ ఒక ఫేక్ పేరుతో ఇంస్టాగ్రామ్ లో ఉన్నాడని బోలెడు పుకార్లు ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో అదే ప్రశ్న అడగగా అతను నిజంగానే ఇంస్టాగ్రామ్ లో ఉన్నాను అంటూ రామ్ చరణ్ నిజాన్ని బయటపెట్టాడు.

"మీకు ఇన్స్టాగ్రామ్ లో సీక్రెట్ ఎకౌంటు ఉందంట కదా అది నిజమేనా?" అని ఇంటర్వ్యూర్ అడగగా "అవును ఉంది. నాక్కూడా బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంటుంది. కానీ పబ్లిక్ కి తెలియకుండా ఉండడానికి సీక్రెట్ గా తెలుసుకుంటా" అని చెప్పాడు రామచరణ్. ఇంతకీ ఆ సీక్రెట్ ఎకౌంటు ఇంస్టాగ్రామ్ ఏ పేరుతో ఉందొ అని వెతకడం మొదలుపెట్టారు అభిమానులు. ఇక రామ్ చరణ్, కీయారా అద్వానీ ముఖ్యపాత్రల్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన 'వినయ విధేయ రామ' సినిమా జనవరి 11న విడుదలకు సిద్ధంగా ఉంది.

Ruthvik

Ruthvik

Next Story