Ram Charan: క్లీంకార వెల్‌కమ్ వీడియో రిలీజ్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. పాప పుట్టిన ఆ క్ష‌ణం..

Ram Charan: క్లీంకార వెల్‌కమ్ వీడియో రిలీజ్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. పాప పుట్టిన ఆ క్ష‌ణం..

Arun Chilukuri
Published on: 20 July 2023 6:30 PM IST
Ram Charan Shares Video Baby Klin Kaara on Upasanas Birthday
X

Ram Charan: క్లీంకార వెల్‌కమ్ వీడియో రిలీజ్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. పాప పుట్టిన ఆ క్ష‌ణం..

Ram Charan: ఈ రోజు(జూలై 20) రామ్ చరణ్ సతీమణి ఉపాసన పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన సతీమణి ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రామ్‌చరణ్‌ తాజాగా ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. ఈ పదకొండేళ్ల తమ వైవాహిక బంధంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన అన్నారు. అలాగే, ఈ రోజుతో తమ కుమార్తె క్లీంకార జన్మించి నెల రోజులు అవుతోన్న సందర్భంగా.. పాప పుట్టిన సమయంలో (జూన్‌ 20) తమ కుటుంబంలో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో అన్న అంశాన్ని ఈ వీడియోతో ఆయన తెలియజేశారు.

ఈ భావోద్వేగం గురించి రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. క్లీంకార పుట్టే స‌మ‌యంలో మా అంద‌రిలోనూ తెలియ‌ని టెన్ష‌న్‌. అంతా స‌రిగ్గా జ‌ర‌గాల‌ని మేం అంద‌రూ ప్రార్థిస్తున్నాం. అందుకు త‌గిన‌ట్టే అన్నీ అనుకూలంగా మారి స‌రైన స‌మ‌యం కుద‌ర‌టంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టింద‌ని భావిస్తున్నాను. పాప పుట్టిన ఆ క్ష‌ణం మ‌న‌సుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్ట‌టానికి ప‌ట్టిన 9 నెల‌ల స‌మ‌యం, అప్పుడు జ‌రిగిన ప్రాసెస్ అంతా త‌లుచుకుని హ్యాపీగా ఫీల‌య్యాం అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story