దురదృష్టవశాత్తు మీ అంచనాలను అందుకోలేకపోయాము: రామ్ చరణ్

Ruthvik
Published on: 5 Feb 2019 1:05 PM IST
దురదృష్టవశాత్తు మీ అంచనాలను అందుకోలేకపోయాము: రామ్ చరణ్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో 'వినయ విధేయ రామ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాంచరణ్ సోషల్ మీడియా ద్వారా సినిమాపై సినిమా గురించి ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ముందుగా తన పట్ల మరియు తన సినిమాల పట్ల ప్రేక్షకులు చూపించే ప్రేమ, అభిమానాలకు వినమ్ర పూర్వక ధన్యవాదాలు అని మొదలుపెట్టాడు చెర్రీ.

'వినయ విధేయ రామ' సినిమా కోసం సాంకేతిక నిపుణులు మరియు రేయింబవళ్లు కష్టపడ్డారని, నిర్మాత దానయ్య గారు అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిదని, సినిమా ని నమ్మిన పంపిణీదారుల కు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తు అనుకున్న విధంగా మంచి సినిమాను అందించలేకపోయామని కానీ భవిష్యత్తులో మాత్రం ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను అంటూ అని ప్రమాణం చేశాడు రామ్ చరణ్. తన తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని, ఈసారి కచ్చితంగా హిట్ అందుకుంటాడని నమ్మకంతో ఉన్నామని ఫ్యాన్స్ కింద కామెంట్లు చేస్తున్నారు.



Ruthvik

Ruthvik

Next Story