Chiranjeevi: మనవరాలి పేరును అధికారికంగా ప్రకటించిన చిరంజీవి

Ram Charan – Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగ‌తి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 30 Jun 2023 4:33 PM IST
Ram Charan And Upasana Daughter Name is Klin Kaara Konidela Says Chiranjeevi
X

Chiranjeevi: మనవరాలి పేరును అధికారికంగా ప్రకటించిన చిరంజీవి

Ram Charan – Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగ‌తి తెలిసిందే. రామ్ చరణ్ కు కూతురు పుట్టడంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ బేబీ నీ ముద్దుగా మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. అలాగే నేడు మెగా లిటిల్ ప్రిన్సెస్ బారసాల వేడుక ఘనంగా నిర్వహించారు. తాజాగా మనవరాలి పేరును చిరంజీవి ట్వీట్ చేశారు. మా ఇంటి మహాలక్ష‍్మి పేరు 'క్లిన్ కారా కొణిదెల' అంటూ పోస్ట్ చేశారు.

ఈ మేరకు ఓ ఫోటోను మెగాస్టార్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ మనవరాలి పేరును వెల్లడించారు. ఆ ఫోటోలో చిరంజీవి దంపతులు, ఉపాసన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతోంది. లలితా సహస్ర నామం నుంచి ఈ పేరు తీసుకున్నట్లు తెలిపారు. ‘‘ఇక, పాప పేరు ‘క్లిన్‌ కారా కొణిదెల’.. లలితా సహస్ర నామం నుంచి ఈ పేరును తీసుకున్నాం. ‘క్లిన్ కారా’ ప్రకృతి స్వరూపాన్ని, ‘శక్తి’ అమ్మవారి అత్యున్నత శక్తిని ఇది సూచిస్తుంది. మా చిన్న యువరాణి ఇలాంటి లక్షణాలను ఇనుమడింపజేసుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story