కేవలం నాన్న కోసమే అంటున్న చెర్రీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన "వినయ విధేయ రామ" సినిమా ప్రేక్షకుల నుండి నెగటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే.

Ruthvik
Published on: 14 Jan 2019 3:52 PM IST
Ram Charan
X
Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన "వినయ విధేయ రామ" సినిమా ప్రేక్షకుల నుండి నెగటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. మాస్ ప్రేక్షకులలో రాం చరణ్ కి ఉన్న కొద్దో గొప్పో క్రేజ్ కూడా బోయపాటి పుణ్యమా అని అది కూడా పోయింది. ఇక ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరో వైపు కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్ సినిమాలని నిర్మిస్తున్నాడు చెర్రీ.

మెగా స్టార్ చిరంజీవి కం బ్యాక్ సినిమా అయిన 'ఖైది నెంబర్ 150' సినిమాని నిర్మించిన రామ్ చరణ్ ఇప్పుడు మళ్ళి చిరూ నటిస్తున్న "సై రా నరసింహారెడ్డి" సినిమాని నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా తరువాత బయట హీరోలతో సినిమా నిర్మిస్తారా అంటే "అస్సలు చెయ్యను ఈ బ్యానర్ లో కేవలం నాన్న ని హీరోగా పెట్టి సినిమాలు చేస్తాను. ఇది కేవలం నాన్న కోసమే స్థాపించిన బ్యానర్. అందుకే నాన్నతో మాత్రమే సినిమాలు చేస్తాను వేరే ఏ హీరో తో చెయ్యను" అని చెప్పాడు రామ్ చరణ్.

Ruthvik

Ruthvik

Next Story