రామ్-పూరి సినిమా లాంచ్ కి ముహూర్తం ఫిక్స్

'నేను శైలజ' సినిమా హిట్టయింది కదా అని ఆనందపడే లోపే 'హైపర్', 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురు ప్రేమకోసమే' అంటూ వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో హీరో రామ్ బాగా నిరాశ చెందాడు.

Ruthvik
Published on: 18 Jan 2019 12:53 PM IST
iSmart Shankar
X
iSmart Shankar

'నేను శైలజ' సినిమా హిట్టయింది కదా అని ఆనందపడే లోపే 'హైపర్', 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురు ప్రేమకోసమే' అంటూ వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో హీరో రామ్ బాగా నిరాశ చెందాడు. మరోవైపు ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ కొడుకుని హీరో గా పెట్టి దర్శకత్వం వహించిన 'మెహబూబా' సినిమా సరిగా ఆడకపోవడంతో డిస్టర్బ్ అయ్యాడు. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' అనే ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాలో రామ్ ఒక సైబర్ మోసగాడి లా కనిపించనున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ఇక ఈ సినిమాను అధికారికంగా జనవరి 23న లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సరికొత్త లుక్ తో మన ముందుకు రాబోతున్నాడు రామ్. పూరి జగన్నాథ్ మరియు చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మేలో విడుదల కానుంది.

Ruthvik

Ruthvik

Next Story