నితిన్ చెక్ : రకుల్ లుక్ రిలీజ్!

HBD Rakul preeth Singh : నేడు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన 30 వ పుట్టిన రోజు జరుపుకుంటుంది.. ఈ సందర్భంగా ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె తాజా చిత్రం 'చెక్' సినిమా నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్..

Krishna
Published on: 10 Oct 2020 3:31 PM IST
నితిన్ చెక్ : రకుల్ లుక్ రిలీజ్!
X

Rakul Preet singh 

HBD Rakul preeth Singh : నేడు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన 30 వ పుట్టిన రోజు జరుపుకుంటుంది.. ఈ సందర్భంగా ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె తాజా చిత్రం 'చెక్' సినిమా నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ కొత్త పోస్టర్ లో రకుల్ చాలా కొత్తగా కనిపిస్తోంది. అంతేకాకుండా చాలా సీరియస్‌గా కనిపిస్తుంది. చేతిలో ఓ ఫైల్ పట్టుకొని ఉంది. చూస్తుంటే అమెది సినిమాలో కీలకమైన పాత్రేనని తెలుస్తోంది.

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ పైన ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమాకి సంబంధించిన టైటిల్ ని రిలీజ్ చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం.. ఇందులో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ తో పాటుగా ప్రియా ప్రకాష్ వారియర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ద్రిల్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

దాదాపుగా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వస్తున్న హలో సినిమాలో కూడా రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.


Krishna

Krishna

Next Story