నితిన్ కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్!

నితిన్ కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్!
x

Nithin Check Movie

Highlights

Nithin Check Movie : వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.. ప్రస్తుతం నితిన్ తో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే..

Nithin Check Movie : వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.. ప్రస్తుతం నితిన్ తో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేస్తూ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. 'చెక్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా, కుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ కేసు, జైలు ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ.. నితిన్ తో సినిమాని చేస్తున్నందుకు ఆనందంగా ఉందని సినిమాలో నితిన్ నటన మరో లెవల్ లో ఉంటుందని అన్నారు. ఇక సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుందని వెల్లడించారు. సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి.


ఇక ఈ ఏడాది భీష్మ సినిమాతో మెప్పించిన నితిన్ ప్రస్తుతం రంగ్ దే అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది... తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.. దాదాపుగా చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.. ఇక నితిన్ కి ఇది 29 వ చిత్రం కావడం విశేషం.

అటు గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమెక్, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టాడు నితిన్. త్వరలో ఈ సినిమాలు కూడా పట్టలేక్కనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories