Rakul Preet: బాలీవుడ్ స్టార్ హీరో సరసన నటించడానికి సిద్ధమవుతున్న రకుల్

Rakul Preet Singh: తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ గత కొద్ది కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉంటుంది

admin1
Updated on: 21 Aug 2021 1:00 PM IST
Rakul Preet Singh Going to Act with Bollywood Star Hero Akshay Kumar | New Movie of Rakul Preet Singh
X

Rakul Preet: బాలీవుడ్ స్టార్ హీరో సరసన నటించడానికి సిద్ధమవుతున్న రకుల్

Rakul Preet Singh: ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ గత కొద్ది కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ మధ్యనే నాగార్జున హీరోగా నటించిన "మన్మధుడు 2" టు సినిమా తో రకుల్ మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ గా మారడంతో అభిమానులు కూడా నిరాశ చెందారు. అయితే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్లో సైతం వరుసగా సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో "రాక్షసుడు" అనే టైటిల్ తో విడుదల అయిన సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. సినిమాకి సంబంధించి దాదాపు మొత్తం షూటింగ్ లండన్లో జరగబోతోందట. అక్షయ్ కుమార్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించడం ఇదే మొదటి సారి. ఈ సినిమా మాత్రమే కాకుండా తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ మరియు వైష్ణవ్ తేజ్ హీరోహీరోయిన్లుగా నటించిన "కొండపొలం" కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story