Rakul Preet Singh: పేరు చిన్నదే.. కానీ, పని మాత్రం పెద్దది: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఎన్నో ద్రావణాలను ట్రై చేస్తూ ఉంటాం.

Venkata Chari
Updated on: 19 April 2021 10:01 PM IST
Rakul Preet Singh About Barley Drink In Summer
X

రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Rakul Preet Singh: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా నీళ్లు, చెరుకు రసం, లెమన్ వాటర్ ఇలా ఎన్నో ద్రావణాలను ట్రై చేస్తూ ఉంటాం. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 'పేరు చిన్నదే అయినా.. పనిలో మాత్రం చాలా పెద్దదే' అంటూ ఆరోగ్య సలహాలు పంచుతోంది.

ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫొటోను షేర్ చేసి ఇలా రాసుకొచ్చారు. వేసవి తాపాన్ని ఎలా తప్పించుకోవాలని అనుకుంటూ ఉన్నారా? అయితే బార్లీ ద్రావణం మిమ్మల్ని రక్షించేందుకు ఉంది. నా న్యూట్రిషన్ ఈ ద్రావణాన్ని నాకు సూచించారు. వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలను, జీర్ణ సమస్యలన్నీంటిని ఇది దూరం చేస్తుంది. చోటా నామ్ బడా కామ్ (పేరు చిన్నది.. పని పెద్దది) అని అంటారు అని రకుల్ ఆ ద్రావణం ఉపయోగాలను వెల్లడించారు.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కోలీవుడ్‌లో శివ కార్తికేయన్ హీరోగా రాబోతోన్న చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో అయితే అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లతో నటిస్తున్నారు.



Venkata Chari

Venkata Chari

Next Story