logo
సినిమా

నాని కోసం ఐటమ్ గర్ల్ గా మారిన రకుల్

నాని కోసం ఐటమ్ గర్ల్ గా మారిన రకుల్
X
Highlights

'స్పైడర్' సినిమా డిజాస్టర్ అయిన తరువాత రకుల్ ప్రీత్ మళ్ళీ తెలుగు తెరపై హీరోయిన్ గా కనిపించి చాలా కాలమైంది. ఈ...

'స్పైడర్' సినిమా డిజాస్టర్ అయిన తరువాత రకుల్ ప్రీత్ మళ్ళీ తెలుగు తెరపై హీరోయిన్ గా కనిపించి చాలా కాలమైంది. ఈ మధ్యనే కార్తి హీరోగా రజత్ రవి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన డబ్బింగ్ సినిమా 'దేవ్' డిజాస్టర్ గా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం తమిళ, హిందీ భాషలో అవకాశాలు బాగానే వస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం అవకాశాలు త‌గ్గిపోయాయి అని చెప్పుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ భామ నాచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

నాచురల్ స్టార్ నాని హీరోగా మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ఈ మధ్యనే లంచ్ అయింది. 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన ఆరుగురు హీరోయిన్ లు నటించనున్నారు. ఇదే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక స్పెషల్ సాంగ్ లో నాని పక్కన స్టెప్పులేయనుంది. రకుల్ స్పెషల్ సాంగ్ లో నటించడం ఇదే మొదటిసారి. ఇక రకుల్ తెలుగులో 'వెంకీ మామ' కు సైన్ చేయగా తమిళంలో సూర్య సరసన 'ఎన్ జి కె' చిత్రంలో నటించింది.

Next Story