నిజ జీవితంలో రకుల్ చేసిన సాహసం

నిజ జీవితంలో రకుల్ చేసిన సాహసం
x
Highlights

'స్పైడర్' సినిమా తరువాత తెలుగు సినిమాలలో కనిపించకుండాపోయిన రకుల్ ప్రీత్ హిందీ, తమిళ భాషల్లో బాగానే బిజీ గా ఉంది. ఆమె నటించిన తమిళ సినిమా 'దేవ్'...

'స్పైడర్' సినిమా తరువాత తెలుగు సినిమాలలో కనిపించకుండాపోయిన రకుల్ ప్రీత్ హిందీ, తమిళ భాషల్లో బాగానే బిజీ గా ఉంది. ఆమె నటించిన తమిళ సినిమా 'దేవ్' తెలుగులో కూడా ఈ వారం విడుదల కానుంది. అయితే అడ్వెంచర్ అంటే బాగా ఇష్టం ఉన్న రకుల్ ప్రీత్ ఈ మధ్యనే ఒక సాహసం చేసింది. షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లిన రకుల్ ప్రీత్ 15 వేల అడుగుల ఎత్తు నుంచి దూకిందట. పారాషూట్ లాంటి కొన్ని భద్రతలు తీసుకున్నప్పటికీ టైం బాగోక పారాషూట్ ఓ పెన్ అవ్వకపోతే పై ప్రాణాలు పైనే పోతాయి.

అయితే దూకే ముందు మాత్రం చేతిలో అన్ని సినిమాలు ఉన్నవేళ ఇలాంటివి అవసరమా అని అనిపించిందట కానీ ఒకసారి దూకిన తర్వాత అవి ఏమీ గుర్తుకు రాలేదట. తాను చేసిన సాహసానికి సంబంధించిన వీడియోని వాళ్ళమ్మకు పంపిస్తే ఆమె బాగా కంగారు పడ్డారట కానీ వాళ్ళ నాన్న నాకు చెప్తే నేను వచ్చేవాడిని గా అని అన్నారు అని చెబుతోంది ఇక ఈమె. గతంలో కూడా బంగీ జంపింగ్, స్కూబా డైవింగ్ లాంటి సాహసాలు చేసిన రకుల్ ఈసారి స్కీడైవింగ్ చేసి షాకిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories