చాలా కాలం తర్వాత అలాంటి పాత్రలో రజిని

చాలా కాలం తర్వాత అలాంటి పాత్రలో రజిని
x
Highlights

శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ అయిన '2.ఓ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ మధ్యనే 'పేట' సినిమాతో మరో హిట్ అందుకున్న...

శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ అయిన '2.ఓ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ మధ్యనే 'పేట' సినిమాతో మరో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక రజనీ తన దృష్టిని తన తదుపరి ప్రాజెక్టు పై పెట్టారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు రజిని. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి పట్టాలెక్కనుంది.

ఈ సినిమా కోసం రజనీకాంత్ 90 రోజుల పాటు కాల్షీట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ గురించి మరియు రజనీ పాత్ర గురించి చాలా పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి చాలాకాలం అవ్వడంతో ఫాన్స్ కి కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories