Rajinikanth: విజయకాంత్ లేని లోటు పూడ్చలేనిది

Rajinikanth: కుటుంబ సభ్యులను ఓదార్చిన రజినీకాంత్

Jyothi
Published on: 29 Dec 2023 1:05 PM IST
Rajinikanth Pays Tribute To Dmdk Chief And Actor Captain Vijayakanth
X

Rajinikanth: విజయకాంత్ లేని లోటు పూడ్చలేనిది

Rajinikanth: తమిళ స్టార్‌ నటుడు, డీఎండీకే చీఫ్‌ కెప్టెన్‌ విజయకాంత్‌ మరణ వార్త తనను ఎంతో బాధించిందని అన్నారు స్టార్‌ నటుడు రజినీకాంత్. శుక్రవారం ఉదయం చెన్నైలోని అన్నాసాలైలోగల ఐలాండ్‌ మైదానంలో కెప్టెన్‌కు రజినీ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. విజయకాంత్‌ మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు రజనీకాంత్. సినీ, రాజకీయ రంగాలకు ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. ప్రియ స్నేహితుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. విజయకాంత్‌ ఆరోగ్య సమస్యల నుంచి త్వరలోనే కోలుకుంటారని అంతా అనుకున్నామని తెలిపారు. ఇటీవలే డీఎండీకే మీటింగ్‌లో ఆయన్ని చూడగానే తనలో కాస్త ఆశ పోయిందన్నారు. ఆయన బతికి ఉండి ఉంటే తమిళనాడు రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించేవారని అభిప్రాయపడ్డారు. విజయకాంత్ లేని లోటు పూడ్చలేనిది’ అంటూ రజినీ ఆవేదన వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story