రాజశేఖర్ వల్ల చిత్ర బృందం షాకయ్యిందట

Kalki
x
Kalki
Highlights

కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ ఈ మధ్యనే 'పిఎస్వి గరుడ వేగా' అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ అయింది.

కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ ఈ మధ్యనే 'పిఎస్వి గరుడ వేగా' అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఒక థ్రిల్లింగ్ సబ్జెక్టు తోనే 'కల్కి' అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు 'ఆ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామా అని తెలంగాణ డ్రాప్ లో సాగే చిత్రమని తెలిసిన విషయమే. ఈ సినిమాలో కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయట.

తాజా సమాచారం ప్రకారం ఎలాంటి డూపులు లేకుండా రాజశేఖర్ స్వయంగా కొన్ని అతి కష్టమైన స్టంట్లు ఈ సినిమా కోసం చేశారని సమాచారం. అలాగే ఈ సినిమాలో ఒక ఏడు నిమిషాల పాటు సాగే ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ 7 నిమిషాల సన్నివేశాన్ని రాజశేఖర్ సింగిల్ టేక్ లో పూర్తి చేసారట. అది చూసి చిత్రబృందం కూడా షాక్ కి గురైంది. రాజశేఖర్ కమిట్మెంట్ పై చిత్ర బృందం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ ఏడు నిమిషాలు యాక్షన్ సన్నివేశం సినిమా లో హైలైట్ గా మారుతుందట. భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories