RRR movie: ఆర్ ఆర్ ఆర్ సినిమా కథ ఇదేనట..ఆయన చెప్పేశారు!

RRR movie: ఆర్ ఆర్ ఆర్ సినిమా కథ ఇదేనట..ఆయన చెప్పేశారు!
x
RRR movie heros with rajamouli at shooting spot (RRR twitter image)
Highlights

టాలీవుడ్ జక్కన్న ఒక సినిమా తీస్తున్నారంటే టాలీవుడ్ మాత్రమే కాదు జాతీయ సినిమా మొత్తం అటువేపే ఆసక్తిగా చూస్తుంది. ఎప్పటికప్పుడు ఆ సినిమా విశేషాలు ఏమైనా...

టాలీవుడ్ జక్కన్న ఒక సినిమా తీస్తున్నారంటే టాలీవుడ్ మాత్రమే కాదు జాతీయ సినిమా మొత్తం అటువేపే ఆసక్తిగా చూస్తుంది. ఎప్పటికప్పుడు ఆ సినిమా విశేషాలు ఏమైనా తెలుస్తాయేమో అని చెవులు.. కళ్ళూ అటువైపు పడేసి ఉంచుతుంది. అభిమానులు అయితే, రాజమౌళి సినిమా విశేషాల కోసం విపరీతమైన ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తీస్తున్నారు. జూనియర్ ఎన్టీఅర్, రామ్ చరణ్ హీరోలుగా పీరియాడికల్ ఫిక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టీ ఆ సినిమా పైనే. ఇటు రాం చరణ్ అభిమానులు.. అటు ఎన్టీఅర్ అభిమానులు ఒక్క్కో అప్డేట్ కోసం నిత్యం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అవుట్ లైన్ రాజమౌళి రివీల్ చేశారు. హీరోల పాత్రల తీరుతెన్నులూ ఇలా ఉండొచ్చని హింట్ కూడా ఇచ్చేశారు. ఎన్టీఅర్ తెలంగాణా యోధుడు కొమరం భీమ్ గా, రాం చరణ్ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గాను కనిపిస్తారని వెల్లడించారు.

ఇక తాజాగా ఈ సినిమా కథ ఇదే అంటూ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజ్ చిన్న కథను చెప్పారు. ఈ సినిమాలో ఆయన మూడు పాటలు రాస్తున్నారు. 1920 ప్రాంతంలో ఇద్దరు వీరులు కొమరం భీమ, అల్లూరి సీతారామరాజు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే కోణం లో సినిమా ఉంటుందని చెప్పిన దర్శకుడు రాజమౌళి స్టొరీ లైన్ ను కొంత వివరంగా సుద్దాల అశోక్ తేజ్ చెప్పారు. అయన చెప్పిన దాని ప్రకారం.. తెలంగాణా యోధుడు కొమరం భీమ్, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఇద్దరూ రెండు సంవత్సరాల పాటు మాయం అయిపోతారు. ఎటు వెళ్ళారో ఎవరికీ తెలీదు. తరువాత ఇద్దరూ ప్రత్యక్షమై కొమరక్మ్ భీమ నిజాం పాలకుల పైనా.. అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్ పాలకులపైనా యుద్ధం చేస్తారు. అయితే, ఈ మాయం అయిపోయిన సమయంలో వారు ఇద్దరూ కలిస్తే.. కలిసి పోరాటానికి దిగితే ఎలా ఉండేది? వారిద్దరూ కలిసి యుద్ధం అంటూ చేస్తే పరిస్థితులు ఎలా మారిపోయేవి అనే ఫిక్షన్ తో సినిమా తెరకెక్కుతోందని సుద్దాల అశోక్ తేజ్ చెప్పారు. ఇంతకు మించి కథను చెప్పడానికి అవకాశం లేదనీ, రాజమౌళి ఇంతకు మించి కథ చెప్పలేదు.. చెప్పడానికి వీలు లేదని రాజమౌళి చెప్పరంతున్నారు సుద్దాల అశోక్ తేజ్. ఈ సినిమాలో తాను రాసిన పాటల పల్లవులను కనీసం తన భార్యకు కూడా చెప్పొద్దని రాజమౌళి చెప్పారంటూ అయన వివరించారు.

మొత్తమ్మీద ఆర్ ఆర్ ఆర్ మూవీ స్టొరీ లైనే ఒక అద్భుతంలా కనిపిస్తోంది. మామూలు ఫిక్షన్ నే ఒక రేంజిలో చూపించి ఆడియెన్స్ కి కొత్త అనుభూతులు పంచీ, రాజమౌలి ఇలాంటి అద్భుతమైన లైన్ ఇద్దరు సూపెర్ హీరోలతో తీస్తున్న సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో ఊహించడం కష్టమే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories