మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి

*మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి

Rama Rao
Updated on: 25 May 2022 9:30 PM IST
Rajamouli Looking for Another Hero for Mahesh Babu Movie | Telugu Movie News
X

మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి

Mahesh Babu-Rajamouli Movie: ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాకి సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే ఈ సినిమా కూడా "ఆర్ఆర్ఆర్" లాగా మల్టీస్టారర్ సినిమా కాబోతోంది అని వార్తలు వినిపించగా రాజమౌళి అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ సినిమాలో మాత్రం విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. ఆ పాత్ర కోసం ఒక స్టార్ హీరో కోసం అయితే బాగుంటుందని రాజమౌళి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా కోసం హీరో రానా ను విలన్ గా మార్చిన రాజమౌళి ఈసారి కార్తి, విక్రమ్, లేదా సూర్య వంటి హీరో కోసం వెతుకుతున్నట్లు సమాచారం.

Rama Rao

Rama Rao

Next Story