'ఆర్ఎక్స్ 100' డైరెక్ట‌ర్ బాలీవుడ్ ఎంట్రీ.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్..

Ajay Bhupathi: "ఆర్ఎక్స్ 100" సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నారు.

Arun Chilukuri
Updated on: 29 July 2022 7:01 PM IST
Raj Kumar Hirani Teams up With RX100 Director
X

‘ఆర్ఎక్స్ 100’ డైరెక్ట‌ర్ బాలీవుడ్ ఎంట్రీ.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్..

Ajay Bhupathi: "ఆర్ఎక్స్ 100" సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నారు. అయితే తాజాగా ఇప్పుడు అజయ్ భూపతి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన రాజకుమార్ హిరాని తో చేతులు కలపబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే అజయ్ భూపతి సినిమా రాజ్ కుమార్ హిరానీకి చాలా బాగా నచ్చడంతో ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్టు గురించి గత సంవత్సర కాలంగా డిస్కస్ చేస్తున్నారట.

అజయ్ భూపతి కొన్ని షార్ట్ ఐడియాస్ ను వినిపించగా హిరానీ అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేశారట. అయితే హిరానీ సెలెక్ట్ చేసిన ఆ స్క్రిప్ట్ కి అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు అజయ్ భూపతి మరికొందరు రైటర్లతో కూడా డిస్కషన్లు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది.

హిందీ మరియు తెలుగులో విడుదల కాబోతున్న ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు అజయ్ భూపతి. "మహాసముద్రం" సినిమాతో కూడా డిజాస్టర్ అందుకున్న అజయ్ భూపతి కనీసం ఈ సినిమాతో నైనా మంచి హిట్ ఇవ్వాలని ఎదురుచూస్తున్నారు. మరోవైపు హిందీలో 3 ఇడియట్స్, సంజు, పీకే, మున్నాభాయ్ ఎంబిబిఎస్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు రాజ్ కుమార్ హిరానీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story