Rahul Ravindran: స్టార్ హీరోయిన్ ని లైన్ లో పెట్టిన రాహుల్ రవీంద్రన్

Rashmika Mandanna New Movie: "చి ల సౌ" డైరెక్టర్తో పుష్ప బ్యూటీ రష్మిక మందన్న

admin1
Updated on: 21 Dec 2021 5:14 PM IST
Rahul Ravindran to Direct Rashmika Mandanna in his New Movie | Tollywood News
X

స్టార్ హీరోయిన్ ని లైన్ లో పెట్టిన రాహుల్ రవీంద్రన్ (ఫైల్ ఫోటో)

Rahul Ravindran - Rashmika Mandanna: నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ "చిలసౌ" సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ రెండవ సినిమా కే నాగార్జున సినిమా చేసే అవకాశాన్ని పొందాడు. కానీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన "మన్మధుడు 2" సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం రాహుల్ మరొక సినిమాని డైరెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె ఎవరో కాదు రష్మిక మందన్న. ఈ మధ్యనే స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక రాహుల్ చెప్పిన కథ కి ఓకే చెప్పిందట. ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలు కాబోతోంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. మరి ఈ సినిమాతో రాహుల్ రవీంద్రన్ ఎంత వరకు హిట్ అందుకుంటాడో వేచి చూడాల్సిందే. మరోవైపు "ఆడవాళ్లు మీకు జోహార్లు", "మిషన్ మజ్ను", "గుడ్ బై" వంటి సినిమాలతో బిజీగా ఉంది రష్మీక.

admin1

admin1

Next Story