ఏప్రిల్ లో భయపెట్టనున్న కాంచన

ఏప్రిల్ లో భయపెట్టనున్న కాంచన
x
Highlights

హారర్‌ సినిమాలంటే ముందుగా గుర్తొచ్చే తెలుగు సినిమాల్లో 'ముని' సిరీస్ కూడా ఒకటి. యాక్టర్, ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న రాఘవా లారెన్స్‌ ఇప్పటికే 'ముని', 'కాంచన', 'కాంచన 2 (గంగ) తో ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు.

హారర్‌ సినిమాలంటే ముందుగా గుర్తొచ్చే తెలుగు సినిమాల్లో 'ముని' సిరీస్ కూడా ఒకటి. యాక్టర్, ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న రాఘవా లారెన్స్‌ ఇప్పటికే 'ముని', 'కాంచన', 'కాంచన 2 (గంగ) తో ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఇప్పుడు మరొకసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా 'ముని' సిరీస్‌లో నాలుగవ సినిమా, 'కాంచన' సిరీస్ లో మూడవ సినిమా అయిన 'కాంచన 3' రెడీ అవుతోంది. మళ్ళీ లారెన్స్‌ హీరోగా నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవ్వనుంది.

రాఘవేంద్ర ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రాఘవ నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగులో లైట్‌హౌస్‌ మూవీమేకర్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై బి. మధు సమర్పిస్తున్నారు. ఈమధ్యనే ఈ సినిమా కు విడుదల తేదీని ఖరారు చేశారు. ఏప్రిల్‌ 18న ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్‌ దుహన్‌ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ముని సిరీస్‌లో వచ్చిన సినిమాలు అన్నీ బాగానే ఆడాయి కాబట్టి 'కాంచన 3' పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories