Raghava Lawrence: బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోన్న లారెన్స్

Raghava Lawrence: సౌత్ లో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న రాఘవ లారెన్స్ బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్నాడు.

Kranthi
Updated on: 4 April 2021 12:35 PM IST
Lawrence is Proving his Talent in Bollywood
X

Raghava Lawrence:(File Image) 

Raghava Lawrence: సౌత్ లో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న రాఘవ లారెన్స్ బాలీవుడ్ లో కూడా సత్తా చాటాడు. హర్రర్ కామెడీ జోనర్ లో తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే పంథాను బాలీవుడ్ లో కొనసాగించడమే కాదు... అక్కడ ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో మీరే చూడండి.

హిట్ కొట్టడం వెన్నతో పెట్టిన విద్య...

హర్రర్ కామెడీ జోనర్ లో సినిమా తీసి హిట్ కొట్టడం రాఘవ లారెన్స్ కు వెన్నతో పెట్టిన విధ్యే. ఈ సీరిస్ లో తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసిన సంగతి అందరికి తెలిసిందే. అదే జోనర్ లో బాలీవుడ్ లో కూడా ప్రయత్నం చేశాడు. కాంచన ను బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్ తో లక్ష్మీగా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

అక్షయ్, రాఘవ కాంబినేషన్ లో...

తాజాగా అక్షయ్ కుమార్ రాఘవ లారెన్స్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'లక్ష్మీ' చిత్రం రికార్డ్ కొట్టింది. ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌పై నమోదు అయిన అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దూసుకుపోతూ 2.50 కోట్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అత్యధిక ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ఇంప్రెషన్స్‌ సాధించిన మూవీగా 'లక్ష్మీ' నిలవడం విశేషం.

లక్ష్మీ సినిమాకు ఊహించని స్పందన...

కరోనా లాక్‌డౌన్ వల్ల లక్ష్మీ సినిమాను థియేటర్స్‌లో కాకుండా మార్చి 21 న స్టార్ గోల్డ్‌లో రిలీజ్ చేస్తే ఉహించని స్పందన సోంతం చేసుకుంది. బాలీవుడ్‌ చిత్రాల చరిత్రను తిరగరాసిన చిత్రంగా ఈ సినిమా నిలవడం ఒక ఎత్తు అయితే... రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన తొలి హిందీ మూవీ ఇదే కావడం విశేషం.

Kranthi

Kranthi

Next Story